T20 World Cup 2024: ఇక ఈ సంవత్సరం టి20 వరల్డ్ కప్ ఉండడంతో ప్రస్తుతం ఇండియన్ టీమ్ దానికి సంబంధించిన కసరత్తులను చేస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ లు అయిపోయిన వెంటనే జూన్ లో ఈ మ్యాచ్ లు స్టార్ట్ అవుతుండడం వల్ల ప్లేయర్లకి ఐపిఎల్ లో ప్రాక్టీస్ అయినట్టుగా అవుతుంది అంటూ బిసిసిఐ కూడా దీని మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే జూన్ 4 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ మ్యాచ్ ల్లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్ లు గా డివైడ్ అయి ఈ మ్యాచ్ లను అడబోతున్నట్టు గా తెలుస్తుంది.
అయితే ఈ మధ్య స్పోర్ట్స్ టాక్ వాళ్ళు ఇండియా టీమ్ టి 20 వరల్డ్ కప్ లో ఆడే మ్యాచ్ ల వివరాలు ఇవే అంటూ విడుదల చేసింది. అందులో జూన్ 5న ఐర్లాండ్, 9 న పాకిస్తాన్, 12 న యుఎస్ఏ, 15 న కెనడాతో ఇండియా మ్యాచ్ లు ఆడుతుంది అంటూ ఆ లిస్టులో తెలియజేశారు. ఇక దీనిపైన ఇప్పటి వరకు ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు…ఇక ఇదిలా ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది అంటూ దాని మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఒకవేళ వస్తే మాత్రం ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి ఆ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను కూడా కొనుగోలు చేసే ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా జనాలు ఉన్నారని తెలుస్తుంది. అయితే టి20 సిరీస్ మొత్తానికి ఈ మ్యాచ్ హైలెట్ కాబోతుందనేది మాత్రం వాస్తవం…అయితే టి20 వరల్డ్ కప్ ను గెలిచి ఈసారి ఇండియన్ టీం తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది.
ఎందుకంటే ఇప్పటికే మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ దారుణంగా ఓడిపోయి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. కాబట్టి ఇప్పటికైన ఈ టి 20 మ్యాచ్ ల్లో విజయం సాధించి తమ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఇండియన్ టీం అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ టోర్నీ లో ఇండియన్ టీమ్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి…