Saindhav
Saindhav: హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ నేపథ్య సినిమాలు చేయడంలో నెంబర్ వన్ గా నిలిచారు వెంకీ. ఈయన నటించిన అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన రానా నాయుడు మాత్రమే బోల్డ్ కంటెంట్ తో వచ్చింది. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో వెంకీ ఇలాంటి సినిమాలో నటించడం ఏంటి అని ముక్కున వేలేసుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వెంకీ సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రానుంది. మరి ఈ సమయంలో వెంకీకి కలిసి వస్తుందా?
సైంధవ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరికి చాలా నచ్చింది. ఈ సినిమాను కూడా వెంకటేష్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకొని చేస్తున్నారట. సెంటిమెంట్ హీరోగా పేరు సంపాదించిన వెంకీ.. సైంధవ్ సినిమాతో కూడా సెంటిమెంట్ తో వస్తున్నారు. ఇందులో పుష్కలంగా సెంటిమెంట్, యాక్షన్ ఉందట. వీటిని ట్రైలర్ లో ఎక్కువగానే చూపించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండడమే కాస్త ఆందోళన కలిగిస్తుంది అంటున్నారు అభిమానులు.
సంక్రాంతి రేసులో గుంటూరు కారం సినిమా కూడా ఉంది. మహేష్ బాబుతో పోటిని తట్టుకొని సైంధవ్ సినిమా నిలుస్తుందా అనే చర్చ నడుస్తోంది. అయితే ఈ సినిమాను ముందు డిసెంబర్ 22న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అనుకోకుండా అదే రోజున సలార్ సినిమా రిలీజ్ ఉండడంతో సైంధవ్ ను పోస్ట్ పోన్ చేశారు. దీంతో సంక్రాంతి బరిలో దిగింది సైంధవ్ సినిమా. హనుమాన్ సినిమా కూడా ఇదే సంక్రాంతి రేసులో ఉండడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రావాల్సిన పెట్టుబడిని సంపాదించింది. లాభాల బాటలో దూసుకొని పోతున్న ఈ సినిమా.. కాస్త పాజిటివ్ టాక్ ను సంపాదించినా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, నా సామిరంగ సినిమాలతో పోటీపడుతుంది సైంధవ్. మరి ఇన్నిసినిమాలను తట్టుకొని సైంధవ్ నిలబడుతుందో లేదో అని కొందరి అనుమానం. కానీ సెంటిమెంట్, యాక్షన్ ఫుల్ గా ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని వెంకటేష్ అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. అయితే సంక్రాంతి బరిలో ఈ సారి 5 సినిమాలు ఉన్నాయి. అంటే సైంధవ్ సినిమాపై ఇంట్రెస్ట్ పెట్టేవారు తక్కువ. మరి ఈ పోటీని తట్టుకొని ఎలా నిలబడుతారో చూడాలి.