Chiranjeevi: ఎన్టీఆర్ అంటే అందరికి ఇద్దరు గుర్తు వస్తారు. సీనియర్ ఎన్టీఆర్, జూ. ఎన్ట్ఆర్ ఇద్దరు కూడా ఎంతో పేరు సంపాదించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ ను ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోరు. ఆ రేంజ్ లో పేరు సంపాదించారు. ఈయన చాలా మంది హీరోలతో కలిసి నటించారు. కొన్ని సార్లు ఏకంగా రెండు, మూడు సినిమాల్లో కూడా నటించారు. ఆ సినిమాలు హిట్ ను కూడా సొంతం చేసుకున్నాయి. ఈయనతో కలిసి నటించడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపేవారు కూడా. అయితే చిరంజీవి మాత్రం ఎన్టీఆర్ తో కలిసి కుమారిడి పాత్రలో నటించలేక పోయారు..ఇంతకీ ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, సీ. ఎన్టీఆర్ కలిసి ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా రావాల్సి ఉండేది. అప్పట్లో ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ ను ఎంతగానో కోరుకున్నారు. కానీ అది జరగలేకపోయింది. 1981, అక్టోబర్ 7న ఎన్టీఆర్ తారాగణంలో కొండవీటి సింహం సినిమా రిలీజ్ అయింది. ఇందులో పోలీస్ పాత్రలో రంజిత్ కుమార్ గా ఎన్టీఆర్ అదరగొట్టారు. కథ కూడా ప్రేక్షకులకు నచ్చే విధంగా సూపర్ గా ఉండడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంతే కాదు ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమా.
ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాలోని డైలాగులు కూడా సూపర్ పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ ఈ డైలాగులు వినిపిస్తుంటాయి. ఈ సినిమాలో చిరు నటించాల్సి ఉండేది. కానీ అలా జరగకుండా ఉండడానికి ఓ కారణం ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు. అందులో రంజిత్ కుమార్ గా ఒకటి. ఈ పాత్రకు ఇద్దరు కుమారులు. అందులో ఒకరు మంచి వారైతే.. మరొకరు నెగటివ్ రోల్. ఇందులో ఒక కుమారుడి వల్ల రంజిత్ ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని జ్యోతిష్యుడు చెప్పడం వల్ల మేనమామ దూరంగా తీసుకెళ్తాడు. తర్వాత మరొక కొడుకు పుడుతాడు.
ఈ పాత్రకు చిరంజీవిని అనుకున్నారు. కానీ ఆయన చాలా బిజీగా ఉండడంతో చిరంజీవి నటించలేకపోయారు. దీంతో ఈ పాత్ర మోహన్ బాబును వరించింది. మొత్తం మీద ఈ సూపర్ హిట్ సినిమాలో ఎన్టీఆర్ కు కొడుకు పాత్రలో నటించలేకపోయారు చిరంజీవి. ఆ తర్వాత తిరుగులేని మనిషి సినిమాలో సీ. ఎన్టీఆర్, మెగాస్టార్ ఇద్దరు కూడా కలిసి నటించారు.