Ind vs ENG 3rd ODI
IND vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో కేఎల్ రాహుల్(KL Rahul), హర్షిత్ రాణా(Harshit Rana) కూడా ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ తన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేదు. మరోవైపు హర్షిత్ రాణా కూడా అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ చేయలేదు. దీంతో వారిద్దరినీ అహ్మదాబాద్ వన్డే నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. వారి స్థానంలో రిషబ్ పంత్(Rishabh pant), అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh) ను తీసుకున్నట్టు సమాచారం. రిషబ్ పంత్ గత శ్రీలంక సిరీస్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయినప్పటికీ .. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో మాత్రం అప్పుడప్పుడు మెరుపులు మెరిపించాడు. రిషబ్ పంత్ కంటే కే ఎల్ రాహుల్ మెరుగని వన్డే సిరీస్లో అతనికి అవకాశం కల్పించారు. కానీ కేఎల్ రాహుల్ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో మూడో వన్డే కు పక్కన పెట్టారు. ఒకవేళ రిషబ్ పంత్ కనుక అహ్మదాబాద్ వన్డేలో మెరుగైన ప్రదర్శన చేస్తే చాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ కంటే అతడినే జట్టులోకి తీసుకునే అవకాశాలుంటాయి. మరోవైపు హర్షిత్ రాణా కూడా ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోవడంతో అతడిని పక్కన పెట్టారు. అతడి స్థానంలో అర్ష్ దీప్ సింగ్ ను తీసుకున్నారు. ఒకవేళ అతడు కనక అహ్మదాబాద్ వన్డేలో మెరుగైన ప్రదర్శన చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలో తుది జట్టులో చోటు లభిస్తుంది.
ఈ వన్డే లో పరిశీలించే అవకాశం
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన 2 వన్డేలలో భారత్ గెలిచినప్పటికీ.. కొందరి ఆటగాళ్ల ప్రదర్శన జట్టు మేనేజ్మెంట్ అనుకున్న స్థాయిలో లేదట. అందువల్లే ఈ మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనను బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిశితంగా పరిశీలిస్తుందట. మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు తుది జట్టులో స్థానం కల్పిస్తారట. 2017లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి ఆ తప్పిదానికి చోటు ఇవ్వకుండా టీం ఇండియా కప్ గెలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు కూర్పు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. బుమ్రా లాంటి ఆటగాడు గాయం వల్ల మెగా టోర్నికి దూరం కావడం టీమిడియాకు కాస్త ఇబ్బందే అయినప్పటికీ.. ఉన్నవాళ్లతోనే మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలని.. కప్ విజేతగా నిలవాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆటగాళ్ల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఐతే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు తిరుగుండదు. ఐతే వచ్చిన అవకాశాలను ఆటగాళ్లు ఏ స్థాయిలో వినియోగించుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది. ” చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే మేనేజ్మెంట్ కూడా అనేక రకాల కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో వన్డే నామమాత్రమే అయినప్పటికీ.. సెలక్షన్ కమిటీ ఈ మ్యాచ్ ను కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు. ఆటగాళ్ల ఎంపిక నుంచి మొదలు పెడితే తుది జట్టు వరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. దీనిని బట్టి టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోందని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.