Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరిగిన అతి పెద్ద తప్పు ఇదే

Rohit Sharma: భారత క్రికెట్ జట్టులో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. విరాట్ కోహ్లి విరామంతో కెప్టెన్ అవకాశాన్ని చేజిక్కించుకున్న రోహిత్ శర్మ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బుధవారం జరిగిన ఇండియా-కివీస్ తొలి మ్యాచ్ లో రోహిత్ సొంత నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. అందరు బౌలర్లను సమర్థంగా వినియోగించుకున్న రోహిత్ వెంకటేశ్ అయ్యర్ ను మాత్రం వాడుకోలేదు. దీంతో అతడిపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెంకటేశ్ అయ్యర్ ఆల్ రౌండర్ కావడంతోనే జట్టులోకి తీసుకున్నారు. కానీ […]

Written By: Neelambaram, Updated On : November 18, 2021 7:11 pm
Follow us on

Rohit Sharma: భారత క్రికెట్ జట్టులో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. విరాట్ కోహ్లి విరామంతో కెప్టెన్ అవకాశాన్ని చేజిక్కించుకున్న రోహిత్ శర్మ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బుధవారం జరిగిన ఇండియా-కివీస్ తొలి మ్యాచ్ లో రోహిత్ సొంత నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. అందరు బౌలర్లను సమర్థంగా వినియోగించుకున్న రోహిత్ వెంకటేశ్ అయ్యర్ ను మాత్రం వాడుకోలేదు. దీంతో అతడిపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వెంకటేశ్ అయ్యర్ ఆల్ రౌండర్ కావడంతోనే జట్టులోకి తీసుకున్నారు. కానీ అతడితో బౌలింగ్ చేయించకపోవడంలో రోహిత్ వ్యూహమేంటనే దానిపై స్పష్టత మాత్రం కానరావడం లేదు. ఒకవేళ ఆట ఓటమి పాలైతే రోహిత్ పై విమర్శల వెల్లువ పెరిగేది. గెలిచినా రోహిత్ నిర్ణయంపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారత జట్టు ఎంపికలో సెలక్టర్లు ఆచితూచి అడుగేస్తారు. అందరి సేవలు వినియోగించుకోవాలని చెబుతుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా రోహిత్ వెంకటేశ్ ను బౌలింగ్ అప్పగించకపోవడంలో ఆయన వైఖరి ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. వెంకటేశ్ కు అవకాశం ఇవ్వకపోవడంపై అందరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

Also Read: David Warner : డేవిడ్ వార్నర్ కే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకే ఇచ్చారట.?

మరో వైపు సీనియర్ బౌలర్లకు అవకాశం ఇచ్చి వెంకటేశ్ అయ్యర్ కు ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బౌలింగ్ లో వారు పొదుపుగా ఆడినా వెంకటేశ్ ను ఎందుకు బౌలింగ్ కు పిలవలేదని ప్రశ్నలు వస్తున్నాయి. కనీసం రెండు మూడు ఓవర్లయినా అతడితో వేయించకుండా తప్పు చేశాడనే అప్రదిష్ట మూటగట్టుకున్నాడు.

Also Read: T20 World Cup Final: బూట్లలో పోసుకుని బీరు తాగడం.. ఆస్ట్రేలియన్ల సంప్రదాయం కథ తెలుసా?

Tags