ఐపీఎల్ ముగింపు దశకు వచ్చింది.ఇక ప్రపంచకప్ టీ20 సమరం మొదలు కాబోతోంది. ప్రస్తుతం ఐపీఎల్ ఫైనల్ లో తలపడేది ఢిల్లీనా? లేదంటే కోల్ కతానా అన్నది ఈరోజు రాత్రి తేలుతుంది.ఇప్పటికే టీమిండియాలోని కీలక ఆటగాళ్లు అంతా ఒక్కచోట చేరారు. ఢిల్లీ, కోల్ కతా, చెన్నై ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్ లో ఆడుతున్నారు.
అక్టోబర్ 17 నుంచి ఈ ప్రపంచకప్ టీ20 కప్ ప్రారంభం కానుంది. ఈ ధనాధన్ టోర్నమెంట్ కోసం భారత జట్టు ఇప్పటికే ఐపీఎల్ తో ఆడి సిద్ధంగా ఉంది. ఈ పొట్టి క్రికెట్ లో పాల్గొనే భారత జట్టు జెర్సీని తాజాగా మార్చేశారు. కొత్త లుక్, కొత్త డిజైన్ లో ఫుల్లీ బ్లూ కలర్ లో ఈ సారి తీర్చిదిద్దారు. కొత్త జెర్సీ ఆకట్టుకునేలా ఉంది.
బీసీసీఐ ఈ జెర్సీని ఆవిష్కరిస్తూ ‘బిలియన్ చీర్స్ జెర్సీ’ అంటూ నామకరణం చేసింది. న్యూలుక్ లో టీమిండియా ఆటగాళ్లు వావ్ అనిపించేలా ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు కు అఫీషియల్ స్పాన్సర్స్ అయిన బైజూస్, ఎంపీఎల్ లోగోలు భారత జెర్సీపై కనిపించాయి. న్యూజెర్సీ మొత్తం డార్క్ బ్లూ కలర్ లో తీర్చిదిద్దారు. ఈ జెర్సీపైన చాలా ప్యాట్రన్స్ ఉండడం విశేషం. ఈ ప్యాట్రాన్స్ ను కోట్లాది మంది అభిమానుల వాయిస్ గా బీసీసీఐ పేర్కొంది.
ట్విట్టర్ లో బీసీసీఐ విడుదల చేసిన కొత్త జెర్సీలు వేసుకొని కెప్టెన్ కోహ్లీ, రోహిత్, రాహుల్, జడేజా, బుమ్రాలు మెరిసారు. ఈ ఏడాది చివరి వరకు ఇదే జెర్సీతో తమ మ్యాచ్ లను టీమిండియా ఆడనుంది. భారత జట్టు ప్రపంచ టీ20 సమరానికి ముందు రెండు వార్మప్ మ్యాచ్ లు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో దుబాయ్ లో ఆడనుంది.
అక్టోబర్ 17న క్వాలిఫైయర్ మ్యాచ్ లతో ప్రపంచకప్ టీ20 సమరం మొదలవుతుంది. అక్టోబర్ 23న అసలు లీగ్ మ్యాచ్ లు ప్రారంభమవుతున్నాయి. లీగ్ దశలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను అక్టోబర్ 24న పాకిస్తాన్ తో ఆడనుంది. అక్టోబర్ 31న న్యూజిలాండ్ తో, నవంబర్ 3న అఫ్ఘానిస్తాన్ తో తలపడనుంది. పాకిస్తాన్ మ్యాచ్ కోసం దేశ ప్రజలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే శత్రుదేశంతో భారత్ సిరీస్ లు బంద్ చేసి చాలా కాలమైంది. దీంతో ఈ రెండు టీంలు కేవలం ఐసీసీ ఈవెంట్లోనే తలపడుతున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ నాడు ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయం.
Presenting the Billion Cheers Jersey!
The patterns on the jersey are inspired by the billion cheers of the fans.
Get ready to #ShowYourGame @mpl_sport.
Buy your jersey now on https://t.co/u3GYA2wIg1#MPLSports #BillionCheersJersey pic.twitter.com/XWbZhgjBd2
— BCCI (@BCCI) October 13, 2021