https://oktelugu.com/

Mega Star Chiranjeevi: మెగాస్టార్ మూవీలో పాట పాడనున్న … బ్రిట్నీ స్పియర్స్ ?

Mega Star Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాల కారణంగా కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఖైదీ నెంబర్‌ 150 తో మళ్లీ వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన చిరు తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇక అనంతరం సైరా నర్సింహ రెడ్డిలో మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశారు. కరోన నేపధ్యంలో సినిమాలకు బ్రేక్ పడగా … ఈ గ్యాప్ లో స్టోరీ సెలక్షన్స్‌ కు పని చెప్పి … ఇప్పుడు వరుస […]

Written By: , Updated On : October 13, 2021 / 05:05 PM IST
Follow us on

Mega Star Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాల కారణంగా కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ఖైదీ నెంబర్‌ 150 తో మళ్లీ వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన చిరు తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఇక అనంతరం సైరా నర్సింహ రెడ్డిలో మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశారు. కరోన నేపధ్యంలో సినిమాలకు బ్రేక్ పడగా … ఈ గ్యాప్ లో స్టోరీ సెలక్షన్స్‌ కు పని చెప్పి … ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్‌ చేతిలో ఏకంగా మూడు సినిమాలున్నాయి.

hollywood-singer-singing-a-song-in-megastar-movie

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు… మోహన్‌ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో తెరకెక్కుతోన్న ‘గాడ్‌ ఫాదర్‌’ లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు చిరు. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్ర చేయనున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న తమన్‌ తీసుకున్న నిర్ణయంతో … దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు.

ఈ సినిమాలో ఒక పాటను హాలీవుడ్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్‌తో పాడించేందుకు తమన్‌ ప్రయత్నిస్తున్నట్లు టాక్‌ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బ్రిట్నీ స్పియర్స్ తెలుగులో పాట పాడేందుకు ఒప్పుకుంటారా లేదా అని అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. మరి నిర్మాతలు కూడా ఆమె అడిగినంతా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారా అని సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తున్నారు.