https://oktelugu.com/

వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కు టీమిండియా ఇదే

ఇంగ్లండ్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ జరుగబోతోంది. గడిచిన నాలుగేళ్లుగా టెస్టుల్లో వరుస విజయాలు సాధించిన టాప్ 2 జట్లు ఈ ప్రపంచ టెస్ట్ చాపింయన్ షిప్ కోసం పోటీపడుతాయి. ఈ క్రమంలో టీమిండియా నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో 2-1, ఇంగ్లండ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ను 3-1తో గెలిచిన ఇండియా నంబర్ 1 స్థానంలోకి దూసుకెళ్లి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత […]

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2021 / 07:44 PM IST
    Follow us on

    ఇంగ్లండ్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ జరుగబోతోంది. గడిచిన నాలుగేళ్లుగా టెస్టుల్లో వరుస విజయాలు సాధించిన టాప్ 2 జట్లు ఈ ప్రపంచ టెస్ట్ చాపింయన్ షిప్ కోసం పోటీపడుతాయి.

    ఈ క్రమంలో టీమిండియా నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో 2-1, ఇంగ్లండ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ను 3-1తో గెలిచిన ఇండియా నంబర్ 1 స్థానంలోకి దూసుకెళ్లి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించింది.

    ఇక రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది. మరోవైపు ఈ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్ తోనూ వారి సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ను టీమిండియా ఆడబోతోంది.

    ఈ క్రమంలోనే ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఫైనల్ కు టీమిండియాను బీసీసీఐ ఎంపిక చేసింది. కాసేపటి క్రితమే బీసీసీఐ 25మందితో కూడిన టీంను ఎంపిక చేసింది.

    ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఆడిన ఆటగాళ్లకే అవకాశం దక్కింది. కొత్తగా నలుగురు యువకులను స్టాండ్ బైగా టీంకు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ తో జరుగబోయే ఐదు టెస్టుల సిరీస్ కు ఇదే జట్టును ప్రకటించారు.

    – భారత జట్టు ఇదే
    కోహ్లీ (కెప్టెన్) , రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, మయాంక్, పూజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఉమేశ్ యాదవ్ ఇషాంత్, షమీ, సిరాజ్, శార్ధూల్..

    ఇక కరోనా, కడుపునొప్పి బారినపడ్డ వృద్ధిమాన్ సాహా, కేఎల్ రాహుల్ లను ఫిట్ నెస్ సాధిస్తే ఇంగ్లండ్ కు పంపిస్తారు. వీరితోపాటు నలుగురు యువ ఆటగాళ్లను స్టాండ్ బైగా ఇంగ్లండ్ పంపిస్తున్నారు.