
గడిచిన 24 గంటల్లో 17,188 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ ప్రకటించారు. 14,655 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ తో 73 మంది మరణించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించిందని, ఈ రోజు 470 మెట్రిక్ టన్నులను సరఫరా చేశామని పేర్కొన్నారు.