MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఇతర ఆధ్వర్యంలో భారత జట్టు ఐసీసీ ట్రోఫీలను దక్కించుకుంది. వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ వంటి వాటిని సగర్వంగా ఒడిసి పట్టింది. అంతటి మెగా టోర్నీలలో విజయం సాధించినప్పటికీ ధోని కించిత్ కూడా గర్వాన్ని దర్శించలేదు. కనీసం కేరింతలు కొట్టలేదు. ఎగిరి గంతెయ్యలేదు. జెంటిల్మెన్ గేమ్ లో జెంటిల్మెన్ లాగానే వ్యవహరించాడు. ఆ టోర్నీలు మాత్రమే కాదు.. మిగతా మ్యాచ్ ల లోనూ ధోని ఇదే తీరును ప్రదర్శించేవాడు. అందువల్లే అతడిని మిస్టర్ కూల్ అని పిలుస్తారు. అయితే అటువంటి ధోని ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. కోపంతో అరిచాడు. పట్టరాని ఆవేశంతో ఊగిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ధోని ఆధ్వర్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ మైదానం స్పిన్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో.. గౌతమ్ గంభీర్ ఫీల్డర్ లను మొత్తం ధోని చుట్టూ మోహరించాడు. బౌలర్ మెలికలు తిప్పే విధంగా బంతులు వేశాడు. దీంతో ధోని తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కనీసం బంతిని టచ్ చేసేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. ధోని పరిస్థితి గమనించిన గంభీర్ స్పిన్నర్లను వరుసగా బరిలోకి దింపాడు.
బౌలర్లు వరుసగా బంతులు వేయడంతో ధోని అసహనానికి గురయ్యాడు. చివరికి ఒక బంతిని బ్యాట్ తో టచ్ చేయడంతో అది గాలిలోకి లేచింది. దీంతో ఆ బంతిని ఫీల్డర్ అమాంతం అందుకున్నాడు. అవుట్ అయిన వెంటనే ధోని గట్టిగా అరిచాడు. పట్టరాని కోపంతో ఊగిపోయాడు.. “చాలామంది ధోనిని మిస్టర్ కూల్ అంటారు కానీ.. ఈ వీడియోలో చూస్తే.. అతడు కూడా ఆవేశపరుడే.. అనుకుంటారు.. ఎందుకంటే ధోని కూడా ఒక మనిషే కదా. అతడికి కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా” అని నెటిజన్లు ఈ వీడియోను చూసిన తర్వాత వ్యాఖ్యానిస్తున్నారు.
Define ragging?
— …. (@thalabheem033) March 20, 2024