https://oktelugu.com/

SUV Compact Car: కాంపాక్ట్ SUV కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే…

అయితే వీటి ధరలు రూ.10 లక్షల పైమాటే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్లు కలిగిన కంపెనీలు కొత్త కాంపాక్ట్ SUVలను రెడీ చేస్తున్నాయి. వీటిని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ కార్ల గురించి తెలుసుకుందాం..

Written By:
  • Srinivas
  • , Updated On : March 21, 2024 / 02:09 PM IST

    compact suv car

    Follow us on

    SUV Compact Car: కారు కొనాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. కానీ తమ అవసరాలకు కన్వినెంట్ గా ఉండే కారు కోసం సెర్చ్ చేస్తుంటారు. ముఖ్యంగా SUV కార్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కాంపాక్ట్ SUV కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి ఫ్యామిలీకి సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఇంజిన్ విషయంలో ప్రత్యేకత చాటుకుంటున్నాయి. అయితే వీటి ధరలు రూ.10 లక్షల పైమాటే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇటీవల కొన్ని ప్రముఖ బ్రాండ్లు కలిగిన కంపెనీలు కొత్త కాంపాక్ట్ SUVలను రెడీ చేస్తున్నాయి. వీటిని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ కార్ల గురించి తెలుసుకుందాం..

    ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ ప్రత్యేకత చాటుకుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు వచ్చి వినియోగదారులను ఆకర్షించాయి. ఇప్పుడీ కంపెనీ కాంపాక్ట్ SUVని తీసుకొస్తుంది. ఇది నెక్ట్స్ జెన్ హ్యుందాయ్ వెన్యూ పేరుతో మార్కెట్లోకి రానుంది. హ్యాందాయ్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన వెన్యూ ను మార్పుచేస్తున్నారు. కొత్త వెన్యూలో ఇంజిన్ లైనప్ ను కొనసాగిస్తూనే ఇంకా మెరుగ్గా ఉండేలా మారుస్తున్నారు. ఇది మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.

    స్కోడా కారు కొనాలని చాలా మంది ఆశిస్తుంటారు. వారికి అనుగుణంగా కంపెనీ కొత్తగా ‘ స్కోడా కాంపాక్ట్ SUV’ ని అందుబాటులోకి తెస్తోంది. 2025 మార్చిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను అమర్చనున్నారు.

    విదేశీ కంపెనీ అయినా కియా కార్లకు భారత్ లో డిమాండ్ ఎక్కువే. ఈ కంపెనీ నుంచి కొత్తగా క్లావిస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ కారు దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. కియా క్లావిస్ లో IC ఇంజిన్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్ లు ఉండొచ్చు. 5 సీటర్ ను కలిగిన ఈ కారు 2025 ప్రారంభంలో రోడ్లపైకి రానుంది. అయితే ఇందులో టాప్ స్పెక్ ఆఫ్ రోడ్ సామర్థ్యాలు ఉండకపోవచ్చని అంటున్నారు.