https://oktelugu.com/

Arsenal vs Manchester United : ఫుట్ బాల్ ప్రియులకు ఇదీ పండుగే పో.. నేడు అర్సెనల్ వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్

ఈ రెండు జట్ల మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్లలో ఎవరు ఆడుతారు అన్న దానిపైన కూడా అభిమానులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. నర్న్ బెర్గ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన అర్సనల్ టీమ్ కు చెందిన లియాండ్రో ట్రోశార్డ్ కోరుకుంటున్నాడు.

Written By:
  • BS
  • , Updated On : July 23, 2023 / 12:53 PM IST
    Follow us on

    Arsenal vs Manchester United : క్లబ్ ఫ్రెండ్లీ మ్యాచ్ లో భాగంగా అర్సెనల్ వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్ జట్ల మధ్య ఫుట్ బాల్ పోరు న్యూ జెర్సీలో ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు మెట్ లైఫ్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ను ఈఎస్పిఎన్ డిపొర్టీస్, ఫుబో టీవీలో వీక్షించే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్ ము టివి, అర్సల్ డాట్ కామ్ లో వీక్షించే అవకాశం ఉంది.

    ఈ రెండు జట్ల మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు జట్లలో ఎవరు ఆడుతారు అన్న దానిపైన కూడా అభిమానులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. నర్న్ బెర్గ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన అర్సనల్ టీమ్ కు చెందిన లియాండ్రో ట్రోశార్డ్ కోరుకుంటున్నాడు. అయితే వెన్నెముక సమస్య ఇబ్బంది పెడుతుండడంతో ఈ మ్యాచ్లో ఆడే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. కై హవెర్ట్జ్ తో ఈ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ మ్యాచ్ ఆడే అర్సనల్ జట్టు లో రామ్స్ డాలే, టోమి యాసు, టింబర్, గాబ్రీయల్, టియార్నీ, ఓడేగార్డ్, రైస్, హవెర్టజ్, సాక, బాలోగన్, మార్టీనెల్లి సభ్యులుగా ఉంటారని భావిస్తున్నారు. అలాగే మాంచెస్టర్ యునైటెడ్ జట్టు విషయానికి వస్తే అంతర్జాతీయ ప్లేయర్లు కాసిమెరో, బృనో ఫర్నేండెజ్, మార్కస్ రాస్ఫోర్డ్, క్రిస్టియన్ ఏరిక్షన్ గాయాలు వల్ల జట్టుకు దూరంగా ఉన్నారు. ఆదివారం జరగనున్న మ్యాచ్ లో హేండర్సన్, వాన్ బిశాఖ, వరానే, మార్టినేజ్, విలియమ్స్, వాన్ డే బీక్, హన్ని బాల్, మౌంట్, శాంచో, మార్షిల్, డీయాల్లో ఆడనున్నారు.