https://oktelugu.com/

Jack Crowley : జాక్ క్రావ్లీ అరుదైన ఘనత.. చరిత్రలో మూడో క్రికెటర్

103 స్ట్రైక్ రేటుతో ఒక ఇన్నింగ్స్ లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్ గా ఆడమ్ గిల్ క్రిస్ట్ తో కలిసి సంయుక్తంగా ఈ స్థానంలో కొనసాగుతున్నాడు. 93 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న క్రావ్లీ యాషెస్ టెస్టుల్లో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లాండ్ బ్యాటరుగా నిలిచాడు. 

Written By:
  • BS
  • , Updated On : July 23, 2023 / 12:46 PM IST
    Follow us on

    Jack Crowley : యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు టెస్టుల్లో తలపడుతున్నాయి. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతుండడంతో ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి, రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిగా, మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఐదు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడింది. ఐదో రోజైన ఆదివారం ఆట ప్రారంభం కావాల్సి ఉంది. ఈ టెస్టులో విజయం సాధిస్తే ఇంగ్లాండ్ జట్టు 2-2 తో సిరీస్ సమం చేసినట్టు అవుతుంది. అప్పుడు ఐదో టెస్ట్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఈ టెస్ట్ లో గెలిచిన జట్టే యాషెస్-2023 కైవశం చేసుకుంటుంది. అయితే, ఈ సిరీస్ లో భాగంగా ఆడుతున్న ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాక్ క్రావ్లీ అదరగొడుతున్నాడు. అద్భుతమైన ఆట తీరుతో అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
    టెస్టుల్లో గత కొన్నాళ్లుగా ఇంగ్లాండ్ జట్టు అనుసరిస్తున్న బజ్ బాల్ వ్యూహాన్ని యాషెస్ సిరీస్ లోనూ అమలు చేస్తోంది. మొదటి రెండు టెస్టుల్లో ఫలితాలు ఇంగ్లాండ్ జట్టుకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అదే విధానాన్ని కొనసాగిస్తూ మిగిలిన టెస్టుల్లోనూ ఆడుతుంది. మూడో టెస్టులో సానుకూల ఫలితం రాగా.. నాలుగో టెస్ట్ లోను ఇంచుమించు అదే ఫలితం దశగా ఇంగ్లాండ్ జట్టు ప్రయాణం సాగుతోంది. ఇకపోతే ఇంగ్లాండ్ జట్టు ఈ సిరీస్ లో అత్యంత వేగంగా ఆడుతోంది. నాలుగో టెస్ట్ లో ఒక్కరోజులోనే దాదాపు 400 పరుగుల మార్కును ఇంగ్లాండ్ జట్టు అందుకుంది. తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండు నాలుగు వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది.
    వన్డే తరహాలో బ్యాటింగ్.. అదరగొట్టిన క్రావ్లీ..
    నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రావ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఆడిన క్రావ్లీ త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. మూడు బంతుల్లోనే శతకం సాధించిన ఈ యంగ్ బ్యాటర్ మొత్తంగా 21 ఫోర్లు, మూడు సిక్సర్లను సాధించాడు. ఈ యంగ్ బ్యాటర్ వేగానికి ఆస్ట్రేలియా బౌలర్లు మూడంటే మూడే మేడిన్ ఓవర్లు వేశారంటే ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే క్రావ్లీ అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. యాషెస్ చరిత్రలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఇంగ్లాండు బ్యాటర్ గా క్రావ్లీ నిలిచాడు. యాషెస్ టెస్టులో ఒక్క సెషన్ లోనే సెంచరీ అందుకున్న ఆరో ఇంగ్లాండు బ్యాటర్ గా రికార్డులకు ఎక్కాడు. క్రావ్లీ స్ట్రైక్ రేటు 103 కాగా యాషెస్ చరిత్రలో ఇదో రెండో బెస్ట్ గా ఉంది. 103 స్ట్రైక్ రేటుతో ఒక ఇన్నింగ్స్ లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్ గా ఆడమ్ గిల్ క్రిస్ట్ తో కలిసి సంయుక్తంగా ఈ స్థానంలో కొనసాగుతున్నాడు. 93 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న క్రావ్లీ యాషెస్ టెస్టుల్లో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లాండ్ బ్యాటరుగా నిలిచాడు.