https://oktelugu.com/

Ashwin Vs Kumble : అశ్విన్ వెర్సస్ కుంబ్లే.. వికెట్ల వేటలో ఎవరు మేటి అంటే..!

ఇకపోతే అశ్విన్ స్వదేశంలో 337 వికెట్లు తీయగా, కుంబ్లే కంటే 13 వికెట్లు అధికంగా తీశాడు. ఇక బౌలర్ గానే కాకుండా బ్యాటరుగా కూడా అశ్విన్ రాణిస్తూ భారత జట్టుకు టెస్టుల్లోనూ అద్భుతమైన విజయాలను అందించాడు. 

Written By:
  • BS
  • , Updated On : July 23, 2023 / 01:01 PM IST
    Follow us on

    Ashwin Vs Kumble : ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. భారతదేశానికి చెందిన స్పిన్నర్లలో బెస్ట్ ఎవరు అన్న దానిపై చర్చ జరిగినప్పుడు టీమ్ ఇండియా లెజెండ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ మధ్య చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అన్నది చెప్పడం కష్టమే. ఇద్దరూ తమ తమ స్థాయిల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి భారత జట్టుకు గొప్ప విజయాలను అందించిపెట్టారు. అయితే ఇద్దరు ఆటగాళ్లు 94 టెస్టులు పూర్తి చేసే సమయానికి మెరుగైన ప్రదర్శన ఎవరు చేశారు అన్న దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. 94 టెస్టులు పూర్తయ్యేసరికి ఇరువురు ఆటగాళ్ళ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన చేసినట్లు వెల్లడవుతోంది.
    భారతదేశానికి ఇప్పటి వరకు ఆడిన స్పిన్నర్స్ లో అశ్విన్ గొప్ప స్పిన్నర్ అనడంలో అతిశయోక్తి లేదు. వందలాది వికెట్లను తీసి భారత జట్టుకు మంచి విజయాలను అందించి పెట్టాడు. బౌలర్ గానే కాకుండా బ్యాటుతోనూ రాణిస్తూ జట్టుకు గొప్ప విజయాలను అందించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు అశ్విన్. ఇప్పటి వరకు రవిచంద్రన్ అశ్విన్ 94 టెస్టులు ఆడి నాలుగు 487 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. డోమినిక వేదికగా జరిగిన మ్యాచ్ లో 12 వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు అశ్విన్. 94 టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. భారత గ్రేట్ స్పిన్నర్ గా పేరుగాంచిన అనిల్ కుంబ్లే 94 టెస్టుల్లో 460 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అశ్విన్ 94 మ్యాచ్లు ఆడిన సమయానికి కుంబ్లే కంటే 27 వికెట్లు అధికంగా తీశాడు. ఇకపోతే అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 619 వికెట్లు పడగొట్టాడు. ఇకపోతే శ్రీలంక లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 94 టెస్టుల్లో 558 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్ గా టెస్ట్ కెరియర్ లో 133 మ్యాచులు ఆడిన మురళీధరన్ 800 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.
    తొలి భారత బౌలర్ గా రికార్డ్ సాధించిన అశ్విన్..
    అశ్విన్ వేగవంతంగా వికెట్లు తీసిన భారత బౌలర్ గా తన పేరిట రికార్డు నమోదు చేసుకున్నాడు. అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450 వికెట్లు తీసిన టెస్ట్ బౌలర్ గా అశ్విన్ ఘనత సాధించాడు. ఇకపోతే అశ్విన్ స్వదేశంలో 337 వికెట్లు తీయగా, కుంబ్లే కంటే 13 వికెట్లు అధికంగా తీశాడు. ఇక బౌలర్ గానే కాకుండా బ్యాటరుగా కూడా అశ్విన్ రాణిస్తూ భారత జట్టుకు టెస్టుల్లోనూ అద్భుతమైన విజయాలను అందించాడు.