Glenn Maxwell: మాక్స్ వెల్ ఇన్నింగ్స్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు…

మ్యాచ్ లో మాక్స్ వెల్ కి తన కాళ్ల కండరాలు పట్టుకోవడంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు.అయిన కూడా ఆయన ఎక్కడ మ్యాచ్ మీద హోప్ వదలకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా గెలుపే నా ధ్యేయం అన్నట్టుగా ముందుకు సాగాడు.

Written By: Gopi, Updated On : November 11, 2023 12:32 pm

Glenn Maxwell

Follow us on

Glenn Maxwell: విజయం మామూలుగా రాదు దాన్ని దక్కించుకోవాలంటే చాలాసార్లు చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది. నిజానికి విజయం కూడా ఈజీ గానే దక్కుతుంది ఎప్పుడు అంటే కష్టాన్ని మనం కష్టం అనుకొనప్పుడు, కన్నీళ్ల ని దిగిమింగినప్పుడు, ఓటమి అనే భయాన్ని జయించినప్పుడు,గెలుపు కోసం ఓపికగా ఎదురుచూసినపుడు విజయం కూడా పెద్ద కష్టమైతే కాదు.ఇక రీసెంట్ గా మాక్స్ వెల్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక అజేయ డబుల్ సెంచరీ చేసి మ్యాచ్ కి విజయాన్ని అందించాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ మ్యాచ్ లో 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఆయన ఒంటి చేత్తో పోరాటం చేసి ఆస్ట్రేలియన్ టీమ్ చరిత్ర లో మిగిలిపోయే గెలుపును అందించాడు. అది మామూలు పోరాటం కాదు ఒక తల్లి కడుపులో నుంచి బిడ్డ బయటికి వచ్చేటప్పుడు ఆ తల్లి చేసే పోరాటం, ఒక సైనికుడు యుద్ధం లో గాయపడిన కూడా దాన్ని లెక్క చేయకుండా తన దేశం కోసం చేసే పోరాటం, అలాంటి యుద్దాన్ని చేసి మాక్స్ వెల్ ఈ మ్యాచ్ లో అలాంటి వేదనకే గురయ్యాడు.ఎందుకు అంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆస్ట్రేలియా అఫీషియల్ గా సెమీ ఫైనల్ కు క్వాలిఫై అవుతుంది.

ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తనదైన రీతిలో టీంకి విజయాన్ని అందించాడు. అందుకే మ్యాక్స్ వెల్ హీరో అయ్యాడు.ఇక తన ఇన్నింగ్స్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఓటమి ఎప్పుడు మనిషిని భయపెడుతూ ఉంటుంది,కానీ ధైర్యంగా పోరాడినప్పుడే విజయం మన సొంతమవుతుంది…

ఈ మ్యాచ్ లో మాక్స్ వెల్ కి తన కాళ్ల కండరాలు పట్టుకోవడంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు.అయిన కూడా ఆయన ఎక్కడ మ్యాచ్ మీద హోప్ వదలకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా గెలుపే నా ధ్యేయం అన్నట్టుగా ముందుకు సాగాడు. ఓటమి భయపెట్టిన కూడా ప్రత్యర్థి బౌలర్ల మీద ఎదురుదాడి చేస్తూ నిలబడ్డ చోటు నుంచే సిక్స్ లు కొట్టడం ఆరంభించాడు. తన కండరాలు పడితే ఏంటి పరిగెత్తకుండా పరుగులు చేయలేనా అని పరుగులు చేసి చూపించాడు.ఇక కండరాలు పట్టింది ఒక వంతుకు ఆస్ట్రేలియా టీమ్ కి బెటర్ అయింది.ఎందుకంటే అవి పట్టకపోయి ఉంటే మాక్స్ వెల్ సింగిల్స్, డబల్స్ మాత్రమే తీసేవాడు, కానీ తొడ కండరాలు పట్టడం వల్ల తను కనీసం నడవలేని స్థితిలో ఉండి కూడా డైరెక్ట్ గా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ అఫ్గాన్ బౌలర్ల పైన ఎటాక్ చేశాడు.

మనం ఏదైనా ప్రయత్నం చేసే సమయంలో ఒక దారి మూసుకుపోయింది అంటే ఇంకొకదారి తెరుచుకునే ఉంటుంది.ఆ దారి ఏంటో తెలుసుకొని పాజిటివ్ వే లో ఆలోచించి ముందుకు వెళ్లాలి
అంతేకానీ నావల్ల కాదు అని ఖాళీ గా కూర్చోకూడదు. మాక్స్ వెల్ తొడ కండరాళ్లు పట్టడం వల్ల ఈ విజయం అనేది ఇంకా తొందరగా దక్కింది లేదంటే ఇంకో ఓవర్ లేట్ అయి ఉండేది…పోరాడే పోరాటంలో స్వచ్ఛత వున్నప్పుడు గెలుపు ఎప్పుడు మన ఆధీనంలోనే ఉంటుంది…