Sreeja Konidela: మంగళవారం నిర్మాత స్వాతి రెడ్డి కి చిరు కూతురు శ్రీజకు లింక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తన లక్కీ ఛార్మ్ పాయల్ రాజ్ పుత్ తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి అదిరిపోయే పాత్రతో వస్తున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మంగళవారం సినిమాలో ఆమె పాత్ర హైలెట్ కాబోతుందని టాక్. ఇప్పటికే ట్రైలర్ లో పాయల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించి హైప్ పెంచేశారు.

Written By: Suresh, Updated On : November 11, 2023 12:38 pm

Sreeja Konidela

Follow us on

Sreeja Konidela: ఆర్ ఎక్స్ 100, మహాసముద్రం సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా మంగళవారం. ఈ సినిమా గురించి టాలీవుడ్ లో తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ట్రైరల్ రిలీజ్ అయినప్పటి నుంచి యూత్ లో మరింత ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని చూస్తున్నారు. ఇక బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో కూడా కాస్త అదే కంటెంట్ తో రానుందా? నెగెటివ్ రోల్ లో నటిస్తుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కూడా. మరి దీనిపై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే.

తన లక్కీ ఛార్మ్ పాయల్ రాజ్ పుత్ తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి అదిరిపోయే పాత్రతో వస్తున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మంగళవారం సినిమాలో ఆమె పాత్ర హైలెట్ కాబోతుందని టాక్. ఇప్పటికే ట్రైలర్ లో పాయల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించి హైప్ పెంచేశారు. ఈ సినిమా ట్రైరల్ గత నెలలోనే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్వయంగా లాంఛ్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునపాటి, సురేష్ వర్మ గురించి ముందుగా ప్రస్తావించారు.

ఇక వీరిద్దరు తనకు సన్నిహితులు అని తెలిపారు. ముఖ్యంగా స్వాతి రెడ్డి డైనమిక్ అని.. ఆమె చిన్న కుమార్తె శ్రీజకు బెస్ట్ ఫ్రెండ్ అని చిరు వెల్లడించారు. దీంతో శ్రీజకు బెస్ట్ ఫ్రెండ్ స్వాతి రెడ్డి అనే వార్త జనాల్లోకి వెళ్లింది. అసలు ఈ స్వాతి రెడ్డి ఎవరు అనుకుంటున్నారా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. నిజానికి స్వాతి రెడ్డి గునపాటి నిర్మాత అని పేర్కొన్నారు. కానీ స్వాతి నిమ్మగడ్డ అని చెబితే అందరికీ అప్పుడే అర్థమయ్యేది.

స్వాతి రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె. అందరికీ ఈమె స్వాతి నిమ్మగడ్డ గానే తెలుసు. 2016లో పారిశ్రామికవేత్త గునపాటి శివకుమార్ కుమారుడు ప్రణవ్ రెడ్డి, స్వాతి పెళ్లాడింది. అప్పటి నుంచి ఈమె స్వాతి రెడ్డి గునుపాటి గా మారింది. ఇప్పుడు మంగళవారం నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి అంటే ఎవరో అనుకున్నారు. అయితే ఆమె మ్యాట్రిక్స్ ఫార్మా సంస్థ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు అని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోతున్నారు కూడా.