Eluru Thief: ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే.. ఏ విధమైన పక్షపాతం లేకపోతే.. పోలీసులు అద్భుతంగా పనిచేస్తారు.. అద్భుతమైన ఫలితాలను అందిస్తారు.. ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులకు చుక్కలు చూపిస్తారు. అసాంఘిక శక్తులకు సినిమా చూపిస్తారు .. సమాజాన్ని.. పౌరులను నియమ నిబంధనల ప్రకారం నడిపిస్తారు.. పోలీసులు తలచుకుంటే.. పోలీసులకు ఎలా ఉంటుందో.. ఏం జరుగుతుందో ఇప్పటివరకు మనం అనేక ఉదాహరణలు చూసాం. అనేక సంఘటనలు కూడా చూసాం. కాకపోతే ఈ కథనం పూర్తి డిఫరెంట్.
Also Read: బండ్ల గణేష్ ఒక్క స్పీచ్ లో హీరోల కెరియర్ ఏంటో తేల్చేశాడుగా…ఆయన మాటల్లో వాస్తవం ఉందా..?
పోలీసులను సవాల్ చేయొద్దు. ముఖ్యంగా వారిని ఇబ్బంది పెట్టే పని అసలు చేయకూడదు. పోలీసులకు సవాల్ విసిరితే వారు అస్సలు ఊరుకోరు. ముఖ్యంగా వారిని ఇబ్బంది పెట్టే పని చేస్తే ఏమాత్రం లెక్కపెట్టరు… ఎంతటి వాడైనా సరే సమయం దొరికితే తుక్కు వదలగొడతారు. ఇటువంటి సంఘటనే ఏపీలో చోటుచేసుకుంది. ఏపీ పోలీసులకు సవాల్ విసిరిన ఓ దొంగకు సరైన బుద్ధి చెప్పారు. చివరికి అతడిని కటకటాల వెనక్కి పంపించారు.. దీనికి సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ట్వీట్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో ఆ సంఘటనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు ప్రాంతంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తుంటాడు.. ఇప్పటికే అతడు అనేక పర్యాయాలు దొంగతనాలు చేశాడు. ఎన్నోసార్లు అతడు పోలీసులకు దొరికినప్పటికీ ఇలా జైలుకు వెళ్లి.. అలా బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన ఆ దొంగ అలా ఉండకుండా ఏకంగా పోలీసులకు సవాల్ విసిరాడు. పోలీసులు నన్ను ఏమి చేయలేరంటూ ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. ” ఇప్పటివరకు ద్విచక్ర వాహనాల దొంగతనాలు చాలా చేశాను… అందులో సెంచరీ మార్క్ కూడా పూర్తి చేసుకున్నాను. గతంలో ఎన్నోసార్లు దొంగతనాలు చేస్తూ దొరికినప్పటికీ బయటికి వచ్చేసాను.. ఇప్పుడు పోలీసులు నన్ను ఏమి చేయలేరంటూ” ఆ దొంగ సెల్ఫీ వీడియో తీసుకొని తన స్నేహితులకు పంపించాడు.. అది కాస్త పోలీసుల దాకా వచ్చింది.
పోలీసులు ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. బృందాలుగా విడిపోయి రంగంలోకి దిగారు. ఐదుగురు దొంగల ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.. ఆ తర్వాత దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏలూరు పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ వీడియోను ఏపీ మంత్రి నారా లోకేష్ రీ ట్వీట్ చేశారు.. ఏపీ పోలీస్ ఆన్ డ్యూటీ అంటూ దానికి కామెంట్ జత చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.. అంతేకాదు ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP Police on Duty https://t.co/PYC2sOyKZ3
— Lokesh Nara (@naralokesh) November 8, 2025