Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం ఇక్కడ ఏ రోజు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నవారే రేపు పాతాళానికి పడిపోవచ్చు. ఈరోజు జీరోగా మొదలైన వారు రేపు టాప్ స్టార్ గా మారి ఇండస్ట్రీని ఏలవచ్చు. కాబట్టి ఇండస్ట్రీలో ఏది జరిగినా కూడా ఓవర్ గా రెస్పాండ్ అవకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇక రీసెంట్గా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సక్సెస్ ఈవెంట్లో బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీలో హీరోల కెరియర్ ఎలా ఉంటుందో ఒక్క స్పీచ్ లో తేల్చి పడేసాడు…
Also Read: బలగం వేణు ఏడ్చేశాడు.. నేను ఒకటే మాట చెప్పాను.. తేజ బయటపెట్టిన నిజం…
హీరో ఒక సక్సెస్ కొడితే వంద మంది తన చుట్టూ చేరి తను చెప్పిందే సత్యం, ఆయన నోట్లో నుంచి వచ్చిందే బంగారం అన్నట్టుగా వ్యవహరిస్తారు. సక్సెస్ లో ఉన్నంతకాలం ఇవన్నీ చెల్లుతాయి. నువ్వు తప్పు చేసిన అది రైట్ గానే కన్వే అవుతోంది. కానీ ఒక్కసారి ప్లాపుల్లో పడ్డావు అంటే మాత్రం నీ చుట్టుపక్కలకు ఎవరూ రారు. వచ్చిన వాళ్ళు ఏదో నిన్ను సూటిపోటి మాటలతో ఆ రోజు నువ్వు అలా చేయడం వల్లే ఈరోజు ఇలా ప్లాపుల్లో ఇరుక్కుపోయావు అంటూ నీ తప్పును వేలెత్తి చూపించే పరిస్థితి వస్తోంది. అందుకోసమే ఇక్కడ ఎవ్వరూ ఏం చెప్పినా కూడా అవన్నీ నీకు వచ్చిన సక్సెస్ ను క్యాచ్ చేసుకోవడానికి తప్ప జెన్యూన్ మాటలైతే కాదు. కాబట్టి చాలా పద్ధతిగా ఉంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారు అంటూ లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరోగా చేసిన మౌళి కి ఈ మాటలు చెప్పాడు. ఇక తనను ఉద్దేశించి మౌళి నువ్వు ఎప్పటికైనా స్టార్ హీరో అవుతావు. కానీ అప్పటివరకు వెయిట్ చేస్తూ మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళు…
ఒక సక్సెస్ రాగానే ఎవరో పిలిచి పార్టీ ఇస్తారు, ఇంకెవరో పిలిచి బహుమానాలు ఇస్తారు వాటన్నింటికీ పడిపోయావంటే నువ్వు ఒక ట్రాప్ లో ఉండిపోతావు. నీ ముందు మహేష్ బాబు, విజయ్ లాంటి హీరోలు కూడా ఎందుకు పనికిరారు అంటూ కొన్ని కామెంట్లు కూడా చేస్తారు. అవన్నింటిని పర్సనల్ గా తీసుకుంటే మాత్రం నీ అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అంటూ మౌళిని ఉద్దేశిస్తూ చెబుతూనే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఒక తత్వాన్ని బోధించాడు…
నిజానికి బండ్ల గణేష్ చెప్పిన మాటల్లో సత్యం ఉంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి మొదట నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారాడు. తన కెరీర్ ని కనక మనం చూసుకుంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చాడు.
ప్రొడ్యూసర్ గా మారి టాప్ హీరోలతో సినిమాలను చేసినప్పటికి ఆ తర్వాత రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి సినిమాలకి దూరమయ్యాడు… ఇక ఆయన తన కెరియర్ లో ఎదుర్కొన్న పరిస్థితులను అనుభవాలుగా మార్చుకొని ఈ జనరేషన్ లో ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్లకి సలహాలు సూచనలను ఇస్తున్నాడు. కాబట్టి బండ్ల గణేష్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని చాలామంది అతనికి సపోర్టుగా మాట్లాడుతున్నారు…