India Vs Sri Lanka Final: ఏషియా కప్ లో భాగంగా ఇండియా శ్రీలంక టీమ్ ల మధ్య కొలంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా సెప్టెంబర్ 17వ తేదీన భారీ ఎత్తున ఫైనల్ మ్యాచ్ జరగనుంది… ఇప్పటికే సూపర్ ఫోర్ లో ఈ రెండు టీం ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో శ్రీలంక మీద ఇండియా ఘన విజయం సాధించింది…అయితే నిన్న జరిగిన ఉత్కంఠ బరిత పోరు లో పాకిస్తాన్ మీద శ్రీలంక విజయం సాధించి ఫైనల్ కీ చేరుకుంది.ఇక దాంతో శ్రీలంక 11వసారి ఫైనల్ కి చేరుకుంది.ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా శ్రీలంక టీమ్ లా మధ్య ప్రేక్షకులను కట్టిపడేసే ఒక మ్యాచ్ అయితే జరుగుతుంది.
అయితే ఇప్పటికే ఈ రెండు టీం ల యొక్క బలాబలాలు ఏంటి అనేది మనం గత మ్యాచ్ లోనే చూసాం కాబట్టి ఇండియా టీం లో బ్యాట్స్ మెన్స్ గత మ్యాచ్ లో శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో కొంతవరకు తరబడ్డారు. అయితే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం మన బ్యాట్స్ మెన్స్ శ్రీలంక బౌలర్ల మీద ఆధిపత్యం చెలాయిస్తేనే, ఇండియా ఈజీగా ఈ మ్యాచ్ గెలవగలుగుతుంది.లేకపోతే ఇండియా ఏషియా కప్ టైటిల్ సాధించడం కష్టమవుతుందనే చెప్పాలి… అయితే గతంలో శ్రీలంక టీమ్ మీద రెండు సార్లు డబుల్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ గత మ్యాచ్ లో ఆప్ సెంచరీ చేశాడు.రోహిత్ శర్మ శ్రీలంక టీమ్ మీద భారీ పరుగులు చేసే సత్తా ఉన్న ప్లేయర్ అనే చెప్పాలి… ఇక ఈ మ్యాచ్ లో కూడా ఆఫ్ సెంచరీ గాని, సెంచరీ గాని నమోదు చేస్తే ఇండియా స్కోర్ భారీ గా చేయడంలో తన వంతు పాత్ర పోషించిన వాడు అవుతాడు. అలాగే గిల్ కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక కింగ్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ లో సెంచరీ దిశ గా సాగుతూ తన బ్యాట్ తో ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేయాలి. కేల్ రాహుల్ , ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా మిడిల్ ఆర్డర్ లో ఒక బలమైన పత్నార్షిప్ నెలకొల్పాలి. ఇక హార్దిక్ పాండ్యా కూడా చివర్లో మెరుపులు మెరూపిస్తే ఇండియా శ్రీలంక మీద భారీ స్కోర్ చేయగలుగుతుంది. ఇక బౌలింగ్ లో జస్ప్రిత్ బుమ్రా,మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ బాగా బౌలింగ్ చేస్తూ శ్రీలంక టీం ని కట్టడి చేయాలి అలా అయితే ఇండియా చాలా ఈజీగా ఈ మ్యాచ్ ని గెలవగలుగుతుంది…
ఇక ఎవరు మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు బాగా బ్యాటింగ్ చేసి కుల్దీప్ యాదవ్ బాగా బౌలింగ్ చేయగలిగితే ఈ మ్యాచ్ లో మనం విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కి వీళ్లు ముగ్గురే చాలా కీలకమైన ప్లేయర్లుగా కనిపిస్తున్నారు…
ఇక ఇప్పటివరకు ఏషియా కప్ ఫైనల్లో ఇండియా శ్రీలంక జట్లు ఎనిమిది సార్లు తలపడితే అందులో ఐదు సార్లు ఇండియా విజయం సాధించింది. శ్రీలంక కేవలం మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఈ రకంగా చూసుకున్న ఏషియా కప్ ఫైనల్లో ఇండియా కి శ్రీలంక మీద మంచి రికార్డ్ ఉందనే చెప్పాలి…