https://oktelugu.com/

Neha Shetty: హాట్ లుక్స్ తో కుర్రకారు మతులు పోగొడుతున్న నేహా శెట్టి…ఇదంతా దాని కోసమేనా..?

ఇక ప్రస్తుతం ఈమె ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తుంది. సినిమాలో మాస్ కా దాస్ అయినా విశ్వక్ సేన్ హీరో గా నటిస్తున్నాడు.ఇక నేహ శెట్టి లైఫ్ స్టైల్ చాప్టర్ 4 అనే పేరుతో లేటెస్ట్ గా తన ఫొటోస్ ని షేర్ చేసింది.

Written By: , Updated On : September 15, 2023 / 09:59 AM IST
Neha Shetty

Neha Shetty

Follow us on

Neha Shetty: సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న పాత్ర లో అయిన సరే నటించాలని చాలామంది నటీనటులు చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు…అలా చాలామంది ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా, హీరోయిన్లుగా సెటిలైపోతూ ఉంటారు. ఇక ప్రస్తుతం అలాంటి కోవకు చెందిన హీరోయినే నేహా శెట్టి…సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డిజే టిల్లు సినిమాతో ఒక మంచి హిట్ అందుకొని ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది…

ఇక ప్రస్తుతం ఈమె ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తుంది. సినిమాలో మాస్ కా దాస్ అయినా విశ్వక్ సేన్ హీరో గా నటిస్తున్నాడు.ఇక నేహ శెట్టి లైఫ్ స్టైల్ చాప్టర్ 4 అనే పేరుతో లేటెస్ట్ గా తన ఫొటోస్ ని షేర్ చేసింది. ఇందులో వంకాయ రంగు స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని చాలా క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలకి ఫోజు ఇచ్చింది. అయితే నేహశెట్టి చూడ్డానికి చాలా సన్నగా కరెంటు తీగలాగా కనిపిస్తూ అందర్నీ ఒక చూపులోనే ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తె ఈ అమ్మడు కేవలం హీరోయిన్ కావాలనే ఒకే ఒక ఉద్దేశంతో న్యూయార్క్ లోని ఫిలిం అకాడమీలో 4 ఏళ్ళు యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ కి వచ్చింది…నేహా శెట్టి గతంలో కూడా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోలకి ఫోజులు కూడా ఇచ్చింది దీంతో ఆ ఫోటోలను చూసిన కుర్ర కారు ఆవిడ అందానికి ఫిదా అయిపోయారు…

ఇక రీసెంట్ గా బెదురులంక 2012 సినిమాతో మంచి విజయాన్ని కూడా అందుకుంది దాంతో ఈవిడకి ఇండస్ట్రీలో మరికొన్ని అవకాశాలు కూడా పెరిగాయి అనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఈమె ఆశలన్నీ విశ్వక్ సేన్ తో చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపైనే పెట్టుకుంది ఈ సినిమా గనక హిట్ అయితే ఆవిడకి పెద్ద హీరోల నుంచి కూడా మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది.ఇక దాని కోసమే ఈవిడ ఎక్కువ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది ఆ ప్రమోషన్స్ లో కూడా హాట్ హాట్ డ్రెస్ లతో కుర్రకారు మతులు పోగుడుతుంది…మొన్న ఒక సాంగ్ లాంచ్ చేసినప్పుడు కూడా స్టేజ్ మీదనే విశ్వక్ సేన్ తో ఆ సాంగ్ మీద పర్ఫాం చేస్తూ ఎక్స్పోజ్ కూడా చేస్తుంది…అయితే ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు మాత్రం నేహా శెట్టి అవకాశాల కోసం చాలా బాగా కష్టపడుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు…ఇక ఇప్పటికే డీజే టిల్లు2 సినిమాలో కూడా నటించే అవకాశం లేకుండా పోయిన ఈ అమ్మడుకి నెక్స్ట్ ఎలాంటి సినిమాల్లో అవకాశాలు వస్తాయో చూడాలి…