Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న ఒలంపిక్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ పోటీలలో భారత్ ఆరు మెడల్స్ సాధించింది. కీలక దశలో ఏడు మెడల్స్ కోల్పోయింది. లేకుంటే భారత్ డబుల్ మార్క్ చేరుకునేది.
ఒలింపిక్ ప్రారంభ వేడుకల్లో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సింధు జాతీయ జెండాను చేత పట్టుకొని ముందు నడిచింది. అప్పట్లో ఆమె ధరించిన చీరపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం నడిచింది.
2008లో బీజింగ్ లో జరిగిన ఒలంపిక్ ముగింపు వేడుకల్లో బాక్సింగ్లో కాంస్య పతకం సాధించిన విజేందర్ సింగ్ జాతీయ జెండాను చేత పట్టుకొనే అర్హతను పొందాడు.
లండన్ ఒలింపిక్స్ లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ కాంస్య పతకం సాధించింది. ముగింపు వేడుకల్లో జాతీయ జెండాతో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఘనత అందుకున్న తొలి మహిళ బాక్సర్ ఆమె.
రియో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో సాక్షి మాలిక్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ క్రమంలో ఆమె ముగింపు వేడుకల్లో జాతీయ జెండా ను చేత పట్టుకునే అరుదైన అవకాశం లభించింది.
టోక్యో ఒలంపిక్స్ లో బజరంగ్ పూనియా రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించాడు. ముగింపు వేడుకల్లో భారత జాతీయ పతాకధారిగా నిలిచాడు.
పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు క్రీడాకారుడు శ్రీజేష్ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ముగింపు వేడుకల్లో జాతీయ పతాకధారిగా గౌరవం పొందాడు. ఇదే సమయంలో తన కెరీర్ కు ముగింపు పలికాడు.
ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ముగింపు వేడుకల్లో ఇండియన్ ఫ్లాగ్ బేరర్ గా అరుదైన గౌరవం పొందింది.
https://timesofindia.indiatimes.com/sports/paris-olympics-2024/olympics-photos/indias-olympic-closing-ceremony-flagbearers-since-2008/photostory/112428621.cms