World Cup 2023 India: భారత్ వేదికగా వండే వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరగనుంది. వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టు సన్నద్ధమవుతోంది. బీసీసీఐ కూడా వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా జట్టును ఎంపిక చేస్తోంది. అయితే వరల్డ్ కప్ కు ముందు ఎక్కువ మ్యాచ్ లు ఆడడం ద్వారా భారత జట్టుకు మరింత ప్రాక్టీస్ కల్పించాలని బిసిసిఐ భావిస్తోంది. ఎందుకోసం పలు సిరీస్ లను నిర్వహిస్తోంది. ఆయా సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది.
భారత జట్టు ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో విజేతగా నిలిచి సుమారు పదేళ్లు కావస్తోంది. చివరిసారిగా 2013లో ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది భారతి జట్టు. ఆ తరువాత నుంచి మరో ఐసిసి ట్రోఫీ సాధించలేకపోయింది. అయితే ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుండడంతో అభిమానులు ఆశలు పెరుగుతున్నాయి. బీసీసీఐ కూడా వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టును ఎంపిక చేస్తోంది. అయితే వరల్డ్ కప్ సన్నాహకంలో భాగంగా ఎక్కువ సిరీస్ లు ఆడేలా బీసీసీ ప్రణాళికలుగా చేస్తుంది. వరల్డ్ కప్ కు ముందు భారత జట్టు ఆడే వివిధ సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది.
జూలై నుంచి ఆగస్టు మధ్య వెస్టిండీస్ పర్యటన..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి తర్వాత భారత జట్టు సుమారు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటుంది. ఈ విశ్రాంతి తర్వాత జూలై నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళుతుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లు భారత జట్టు ఆడుతుంది. వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ రెండు జట్లను ఎంపిక చేసింది. టెస్ట్, వన్డే మ్యాచ్ లు ఆడేందుకు రోహిత్ శర్మ సారధ్యంలోని ఒక జట్టును ఎంపిక చేయగా, టి20 సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని మరో జట్టును సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా వన్డే జట్టును, టి20 వరల్డ్ కప్ లక్ష్యంగా టి20 జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది.
ఐర్లాండ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ లు..
వెస్టిండీస్ పర్యటన పూర్తయిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ తో మూడు టి20 మ్యాచ్లు ఆడనుంది.
ఆ తరువాత సెప్టెంబర్ లో భారత్ జట్టు ఆసియా కప్ ఆడనుంది. సుమారు నెలరోజుల ఫోటో ఆసియా కప్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆసియా కప్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలలోనే ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డే మ్యాచ్లు భారత జట్టు ఆడనుంది. ఈ సిరీస్ కోసం వన్డే ప్రపంచ కప్ ఆడే ఆటగాళ్లను బరిలోకి దించనుంది భారత జట్టు. ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే అక్టోబర్ నవంబర్ నెలలో జరిగే ప్రపంచ కప్ కు భారత జట్టు సిద్ధమవుతోంది. వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టు వన్డే సిరీస్ లు ఆడబోతుంది. వచ్చే నెల 12 నుంచి నవంబర్ వరకు వరుసగా క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. క్రికెట్ తో అభిమానులు పండగ చేసుకోనున్నారు.