NTR Fan Shyam Death – Politics : జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతడి చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉంది. దీంతో సహజంగానే పోలీస్ విచారణ చేపట్టాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. అయితే ఆయన చనిపోయింది వైసీపీ కార్యకర్తల చేతుల్లో అని బయటకు రావడంతో సహజంగానే ఇది రాజకీయరంగు పులుముకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ టీడీపీ నుంచి రోజురోజుకూ పెరుగుతోంది. అటు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సైతం స్పందించి మృతిపై న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ట్విట్ చేశారు.
శ్యామ్ కుమార్ అనే కుర్రాడు ఎన్టీఆర్ వీరాభిమాని. ఇటీవల అనుమానాస్పదంగా చనిపోయాడు. నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో ఆయన చనిపోయింది వైసీపీ కార్యకర్తల చేతుల్లోనే అంటూ ఒక కామెంట్ బయటకు వచ్చింది. క్షణాల్లో వైరల్ అయ్యింది. రాజకీయ వార్తగా మారింది. అయితే ఇక్కడే ఒక ట్విస్టు. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ అడ్డంగా బుక్కయ్యింది. శ్యామ్ చనిపోయిన ముందు మాట్లాడిన వీడియోలు ఇవి అంటూ పోస్టులు పెట్టారు. అవి మరింత అనుమానాస్పదంగా ఉన్నాయి.
దీనిపై నెటిజన్లు, టీడీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్యామ్ మాటల్లో భయం కనిపిస్తోందని.. ఎవరో బెదిరించి మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయని.. అంటే శ్యామ్ ను వాచ్ చేశారని.. వెంటాడరని కొత్త అనుమానాలను తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ.. టీడీపీ నాయకులు వైసీపీకి నేరుగా నిందించలేదు. ఒక రకమైన అనుమానాన్ని మాత్రమే వ్యక్తం చేశారు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఇవేవీ ఆలోచించకుండా శ్యామ్ సెల్ఫీ వీడియోలు కాకుండా…ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడించిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేయడంతో ఈ వ్యవహారం తనపై నెట్టుకున్నట్టయ్యింది.
అయితే ఈ కేసును ఆత్మహత్యగా క్లోజ్ చేయాలని పోలీసులు చూస్తున్నారు. తల్లిదండ్రులు సైతం తమ కుమారుడిది ఆత్మహత్యేనని దర్యాప్తులో చెప్పారని చెబుతున్నారు. కానీ శ్యామ్ తండ్రి మాత్రం ఎవరో చంపేశారని ఆరోపిస్తున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. నివాళులు అర్పించారు. ఎలా చనిపోయాడో తెలియకపోవడం కలిచి వేస్తుందని కామెంట్స్ చేశారు. చంద్రబాబు, లోకేష్ లు దర్యాప్తునకు డిమాండ్ చేయడాన్ని నీలి మీడియా తప్పుపడుతోంది. అదంతా ఎన్టీఆర్ ప్రాపకం కోసమేనని ఆరోపిస్తోంది. కానీ ఓ యువకుడి మృతి రాజకీయాంశంగా మారిపోయింది. కేసు పక్కదారి పడుతోంది.