https://oktelugu.com/

Senior Cricketers: రిటైర్‌ అయ్యే భారత్, ఇతర దేశాల సీనియర్లు వీరే!

టీమిండియాలో చూస్తే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారిలో రవిచంద్రన్‌ అశ్విన్, మహ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో సీనియర్లు వీరే.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 30, 2024 / 05:34 PM IST

    Senior Cricketers

    Follow us on

    Senior Cricketers: టీ20 ప్రపంచ కప్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం టీమిండియా 17 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దీంతో భారత స్టార్‌ ప్లేయర్లు.. విరాట్‌ కోహ్లి, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌శర్మ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ముందే ప్రకటించకపోయినప్పటికీ ఇదే మంచి తరుణంగా భావించారు. దీంతో కోహ్లి మ్యాచ్‌ ముగిసిన వెంటనే టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌శర్మ కూడా టీ20 ఆటకు గుడ్‌ బై చెప్పారు. దీంతో ఇప్పుడు భారత్‌తోపాటు ప్రపంచ క్రికెట్‌ జట్లలో రిటైర్మెంట్‌ ప్రకించే ఆటగాళ్లపై చర్చ జరుగుతోంది.

    టీమీండియాలో వీరు…
    టీమిండియాలో చూస్తే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారిలో రవిచంద్రన్‌ అశ్విన్, మహ్మద్‌ షమీ, రవీంద్ర జడేజా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో సీనియర్లు వీరే.

    ప్రపంచ ఆటగాళ్లు..
    ఇక ప్రపంచ ఆటగాళ్లు చూస్తే డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా) ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించారు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియంసన్‌ కూడా టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. అదే బాటలో సౌత్‌ఆఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్‌ అల్‌ హసన్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ నబీ ఉన్నారు. వీరితోపాటు పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ కూడా రిటైర్మెంట్‌ ఆలోచనలో ఉన్నాడు.