https://oktelugu.com/

Smriti Mandana : ఈ సంవత్సరం స్మృతి మందాన తగ్గేదేలే.. రికార్డుల మీద రికార్డులతో మహిళా క్రికెట్ ను ఊపేస్తోంది

టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు కొన్ని రోజులుగా అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. వన్డేలు, టెస్టులతోపాటు టీ20 మ్యాచ్‌లలోనూ సత్తా చాటుతోంది. టీం సమష్టిగా ఆడుతూ రికార్డులు సృష్టిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 20, 2024 / 10:52 AM IST

    Smriti Mandana

    Follow us on

    Smriti Mandana : ఇండియాలో క్రికెట్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఆటకు ఉన్నంత అభిమానులు మరే ఆటకు లేరు. అయితే క్రికెట్‌లోనే పురుషుల జట్టుకు ఉన్న ఫాలోయింగ్‌ మహిళల జట్టుకు లేదు. దీంతో మహిళా క్రికెట్‌ను కూడా ప్రోత్సహించేందుకు బీసీసీఐ చర్యలు చేపట్టింది. దీంతో కొన్నేళ్లుగా మహిళా క్రికెటర్లు కూడా ఆటలో ప్రతిభ కనబరుస్తున్నారు. స్వదేశంతోపాటు విదేశీ గడ్డపైనా సత్తా చాటుతున్నారు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌తో చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో కెస్టెన్‌ స్మృతి మంధన, చిరా ఘోచ్‌ మెరుపు బ్యాటింగ్‌చేశారు. దీంతో టీమిండియా మహిళా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. నవీ ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చేసిన స్కోరే ఇప్పటి వరకు టీ 20ల్లో అత్యధికం. ఈఏడాది ప్రారంభంలో ఆసియా కప్‌లో యూఏఈ జట్టుపై 201 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా మహిళా జట్టు తిరగరాసింది. ఇక 2023లో నార్త్‌ సిడ్నీలోని ఓవల్‌ మైదానంలో జరిగిన టీ20లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆ జట్టుపై ఇదే అత్యధిక స్కోరు. ఇప్పుడు టీమిండియా దానిని కూడా తిరగరాసింది.

    మహిళా క్రికెట్‌లో ఇదే త్యధికం..
    తాజాగా టీమిండియా జట్టు వెస్టిండీస్‌ జట్టుపై చేసిన 2017 పరుగులే మహిళా టీ20లో చేసిన అత్యధిక పరుగులు. 2018లో జరిగిన ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయడం గతంలో అత్యధికం. ఇక తాజాగా భారీ స్కోర్‌ చేసిన టీమిండియాలో కెస్టెన్‌ సమృతి మందన కూడా కొత్త రికార్డు సృష్టించింది. టీ20ల్లో 30వ హాఫ్‌ సెంచరీ చేసింది. ఈ మ్యాచ్‌లో 77 పరుగులు చేసింది. టీ20ల్లో అత్యధిక స్కోర్‌ సాధించిన మహిళల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో సుజీ బేట్స్‌ 29 హాఫ్‌ సెంచరీలతో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రిచా ఘోష్‌ కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసింది. 2015లో భారత్‌పై సోఫీ డివైన్, 2023లో వెస్టిండీస్‌పై ఫియోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ కూడా 18 బంతుల్లో అర్ధశతకాలు సాధించారు.2019లో వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన 24 బంతుల్లో స్కోరు చేసిన మునుపటి ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.

    – స్మృతి మందన ఈ ఏడాది టీ20ల్లో 8 అర్ధ సెంచరీలు చేసింది. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో ఒక మహిళా క్రికెటర్‌ ఇన్ని అర్ధసెంచరీలు చేయడం ఇదే తొలిసారి. గతంలో మిథాలీరాజ్‌ 7 అర్ధసెంచీలు చేశారు. 2018 ఇయర్‌లో ఈ ఫీట్‌ నమోదు చేశారు. దానిని మంధన అధిగమించారు.

    – ఇక స్మృతి మందన 2024లో టీ20లో 763 పరుగులు చేశారు. ఇది కూడా ఒక రికార్డే. ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో అత్యధిక టీ20ల పరుగుల జాబితాలో చమరి అతపత్తు రెండో స్థానంలో ఉంది, ఆమె మొత్తం 720 ఈ సంవత్సరం కూడా వచ్చింది.

    – ఈ సిరీస్‌లోని మంధానతో సహా వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ టీ20లలో యాభై–ప్లస్‌ స్కోర్‌లు సాధించిన భారతీయ బ్యాటర్‌ల సంఖ్య 6కు చేరింది. 2016 మరియు 2018 మధ్య నలుగురితో మిథాలీ మాత్రమే ఉంది.

    – 2024లో భారత్‌తో సహా టీ20లలో క్యాలెండర్‌ సంవత్సరంలో బహుళ 200–ప్లస్‌ మొత్తాలను కలిగి ఉన్న జట్ల సంఖ్య 7. పూర్తి సభ్యులలో, ఆస్ట్రేలియా మాత్రమే ఇంతకు ముందు ఈ ఘనతను సాధించింది, 2019లో అలాంటి మూడు మొత్తాలతో.

    – గురువారం భారత్‌ (7) మరియు వెస్టిండీస్‌ (7) కొట్టిన సిక్సర్లు, టీ20లో అత్యధికంగా 14 సిక్సులతో రెండో స్థానంలో ఉంది. 2018లో పోచెఫ్‌స్ట్‌రూమ్‌లో దక్షిణాఫ్రికా మరియు భారత్‌లు చేసిన 15 సిక్సర్లు అత్యధికం.

    – ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్‌ 374. టీ20 ఫార్మాట్‌లో ఇన్ని పరుగులు నామోదు కావడం కూడా రికార్డే.

    – టీ20లో వెస్టిండీస్‌కు అత్యధికంగా గురువారం డియాండ్రా డాటిన్‌ చేసిన పరుగులు 54. 2023లో ఆస్ట్రేలియాపై ఆలియా అలీన్‌ తన నాలుగు ఓవర్లలో 53 పరుగులు చేయడం గతంలో అత్యధికం.