https://oktelugu.com/

SSC Exam Schedule : తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు ఇవే..

తెలంగాణ ఉన్నత విద్యాశాఖ డిసెంబర్‌ 17న ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. రెండు రోజుల వ్యవధిలో ఎస్సెస్సీ బోర్డు పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 20, 2024 / 10:42 AM IST

    SSC Exam Schedule

    Follow us on

    SSC Exam Schedule :  తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఎస్సెస్సీ బోర్డు విడుదల చేసింది. ఇప్పటికే విద్యా ప్రణాళిక ప్రకారం… సిలబస్‌ తుది దశకు చేరుకుంది. వార్షిక పరీక్షలకు సంబంధించిన కరదీపికల పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలోనే ఎస్సెస్సీ బోర్డు.. పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించింది. 2025, మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొంది. హిందీ పరీక్ష తర్వాత ఒక రోజు సెలవు ఉంది. ఇంగ్లిష్‌ పరీక్ష తర్వాత కూడా సెలవు వస్తుంది. గణితం తర్వాత కూడా మరో సెలవు వస్తుంది. అంటే ఇంగ్లిష్, మ్యాత్స్, ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షలకు ముందు రోజు సెలవు వస్తుంది. ఇక సోషల్‌ పరీక్షకు ముందు మూడు రోజులు సెలవు వస్తుంది.

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ :
    తేదీ పరీక్ష సమయం
    2025 మార్చి 21 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9.30–12.30
    మార్చి 22 సెకండ్‌ లాంగ్వేజ్‌ ఉదయం 9.30–12.30
    మార్చి 24 ఇంగ్లీష్‌ ఉదయం 9.30–12.30
    మార్చి 26 గణితం ఉదయం 9.30–12.30
    మార్చి 28 ఫిజిక్స్‌ ఉదయం 9.30–11.00
    మార్చి29 బయాలజీ ఉదయం 9.30–11.00
    ఏప్రిల్‌ 2 సోషల్‌ స్డడీస్‌ ఉదయం 9.30–12.30
    ఏప్రిల్‌ 3న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌–1 భాషా పరీక్ష,
    ఏప్రిల్‌ 4న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌–2 భాషా పరీక్ష జరగనుంది.

    ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ ఇలా..
    ఇక ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది. 2025, మార్చి 17 నుంచి మార్చి 31 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇక తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరుగుతాయి. టెన్త్, ఇంటర్‌ పరీక్షలు క్లాష్‌ కాకుండా షెడ్యూల్‌ రూపొందించాయి.