https://oktelugu.com/

India Vs South Africa Final: హార్దిక్‌ను ముద్దాడిన కెప్టెన్‌.. వీడియో వైరల్‌

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 177 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా ముందు నిలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 30, 2024 / 03:14 PM IST

    India Vs South Africa Final

    Follow us on

    India Vs South Africa Final: భారత క్రికెట్‌ జట్టు 20 ప్రపంచ కప్‌ – 2024 విజేతగా నిలిచింది. శనివారం(జూన్‌ 29న) దక్షిణాప్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాలో విజయం సాధించి 17 ఏళ్ల తర్వాత మళ్లీ విజేతగా అవతరించింది. ఇక తొలిసారి ఛాంపియన్‌గా నిలవాలనకున్న దక్షిణాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లింది.

    177 పరుగుల టార్గెట్‌
    టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 177 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా ముందు నిలిపింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇదే అత్యధిక స్కోర్‌. దీనిని ఛేదించి ఉంటే.. దక్షిణాఫ్రికా పేరిట ఆ రికార్డు ఉండేది. ఇక ఈ మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. 177 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా బూమ్రా, హర్షదీప్‌సింగ్, హార్దిక్‌ పాండ్యాల అద్భుత బౌలింగ్‌కు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 7 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా ట20 ఛాంపియన్‌గా అవతరించింది.

    రోహిత్‌ ఎమోషన్‌..
    టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత క్రికెట్‌ జట్టు సారధి రోహిత్‌శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మధ్య ఎమోషనల్‌ మూమెంట్స్‌ కనిపిచాయి. చివరి ఓవర్‌ వేసిన హార్దిక్‌.. తక్కువ పరుగులు ఇవ్వడమే కాకుండా కీలక మిల్లర్‌ వికెట్‌ తీశాడు. దీంతో భారత కెప్టెన్‌ రోహిత్‌ లాస్ట్‌ ఓవర్‌ వేసిన హార్దిక్‌కు ముద్దు ఇచ్చాడు. వీరిద్దరూ ఎమోషనల్‌ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    ఎమోషనల్‌ మూమెంట్‌..
    మ్యాచ్‌ అనంతరం ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ ‘ఇది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మేము చాలా కష్టపడ్డాం. ఈ మ్యాచ్‌ నాకు మరింత ప్రత్యేకమైనదని నేను భావిస్తున్నాను, ఆరు నెలలుగా నేను ఒక్క మాట కూడా మాట్లాడనందుకు కృతజ్ఞతతో ఉన్నాను. కష్టపడి పనిచేస్తే ప్రకాశించే సమయం వస్తుందని నేను నమ్మాను. ఇది ప్రతిదీ సంగ్రహిస్తుంది అని నేను అనుకుంటున్నాను. గెలవాలనేది ఒక కల, ముఖ్యంగా ఇలాంటి అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నాడు.