https://oktelugu.com/

Ambati Rayudu: అంబటి రాయుడు కెరియర్ లో జరిగిన కీలక మార్పులు ఇవే…ఆయన్ని తొక్కేసింది ఎవరంటే..?

2018లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజ్ ఎప్పుడైతే రాయుడుని తీసుకుందో అప్పటినుంచి రాయుడు కెరియర్ చాలా అద్భుతంగా సాగిందనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : September 18, 2023 / 05:14 PM IST

    Ambati Rayudu

    Follow us on

    Ambati Rayudu: ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చాలామంది ప్లేయర్లు వాళ్ళకి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకుంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ ఇండియన్ క్రికెట్ కి ఎనలేని సేవలు చేస్తూ మంచి గుర్తింపును పొందుతారు. అయితే తెలుగుతేజం అయిన అంబటి రాయుడు కూడా ఇండియా తరుపున ఎక్కువ మ్యాచు లు ఆడుతూ ఇండియన్ క్రికెట్ కి చాలా సేవలు చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే ఆయన కెరియర్లో చాలా కీలకమైన మార్పులే జరిగాయి. ఇండియన్ క్రికెట్ టీం కి యువ కెరటం రాయుడు రాబోతున్నాడు అని అందరూ అనుకున్నారు. ఇక ఇండియన్ క్రికెట్ బాధ్యత మొత్తం తనే మోయబోతున్నాడు అనే వార్తలు రాయుడు మీద విపరీతంగా వచ్చాయి.కానీ సరిగ్గా అదే టైంలో అర్జున్ యాదవ్ తో గొడవ పెట్టుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ కి సెలెక్ట్ అవకుండా కొద్ది రోజులపాటు అలాగే ఉండిపోయాడు.ఇక ఆ తర్వాత ఐ సి ఎల్ క్రికెట్ ఆడాడు ఇక అక్కడి నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు.

    ఆయన కెరియర్ లో జరిగిన మరో మలుపు ఏంటంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీం తరఫున సెలెక్ట్ అయి ఆ టీమ్ కి క్రికెట్ ఆడడం ఆ టీమ్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా ఆయన చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాడు, అలాగే ఎక్కువ స్కోర్ చేయడానికి ఎప్పుడు చాలా కష్టపడుతూ ఉండేవాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజ్ ఎప్పుడైతే రాయుడుని తీసుకుందో అప్పటినుంచి రాయుడు కెరియర్ చాలా అద్భుతంగా సాగిందనే చెప్పాలి.2018 ఐపీఎల్ లో చెన్నై తరుపున చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన రాయుడు 2019 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ రాయుడు ప్లేస్ లో త్రీడీ ప్లేయర్ అయిన విజయ్ శంకర్ ని సెలెక్ట్ చేశారు దానికి కారణం కే ఎస్ కే ప్రసాద్ అని కూడా ఒక ఇంటర్వ్యూలో రాయుడు చెప్పడం జరిగింది. రాయుడు నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్ విజయ్ శంకర్ నెంబర్ 6 లో గానీ, నెంబర్ 7 లో గానీ ఆడే ప్లేయర్ నెంబర్ ఫోర్ లో ఆడే ప్లేయర్ కోసం నెంబర్ సెవెన్ లో ఆడే ప్లేయర్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు.అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది.ఈ చిన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తెలుగు తేజం అయిన అంబటి రాయుడుని తొక్కేయడానికి ఇలా చేశారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. రాయుడు లేకపోవడం వల్లే 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇండియా న్యూజిలాండ్ మీద సెమీ ఫైనల్ మీద మ్యాచ్ ఓడిపోయింది.రాయుడు ఉండి ఉంటే ఆ మ్యాచ్ ఇండియా ఈజీగా గెలిచేది…