Asia Cup 2023 Final: ఏషియా కప్ ఫైనల్ లో భాగంగా నిన్న ఇండియా శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్నకరిగింది.ఈ మ్యాచ్ లోఇండియా శ్రీలంక మీద ఘన విజయం సాధించింది 15.2 ఓవర్లకే శ్రీలంక 50 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఇండియన్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేసి శ్రీలంక తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర తను పోషించాడు ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక బ్యాట్స్ మెన్స్ ని భారీ దెబ్బ తీశాడు ఇక ఈ మ్యాచ్ లో అత్యుత్తమమైన బౌలింగ్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్ లో తన కెరీర్ లోనే ఎప్పుడు చేయలేని విధం గా అత్యుత్తమమైన బౌలింగ్ చేశాడు. ఏడోవర్లు వేసి 21 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశాడు.దీంతో ఇదే సిరాజ్ వన్డే కెరియర్ లో బెస్ట్ పర్ఫామెన్స్ గా నిలిచింది…అలాగే 51 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా నెమ్మదిగా ఆడకుండా మొదటి నుంచే మంచి దూకుడుగా ఆడటం స్టార్ట్ చేసింది 37 బంతులోనే లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 23 పరుగులు చేశాడు.షుభమాన్ గిల్ 19 బంతుల్లో 27 పరుగులు చేశారు.ఇద్దరు కలిసి ఒక వికెట్ కూడా నష్టపోకుండా 37 బంతుల్లోనే 51 పరుగులు పూర్తి చేసి ఇండియాకి భారీ విజయాన్ని అందించారు. దీంతో 263 బంతులు మిగిలి ఉండగానే ఇండియా ఫైనల్ మ్యాచ్ లో గెలిచింది. 2003 వ సంవత్సరంలో ఇంగ్లాండ్ తో ఆడిన వన్డే ఫైనల్ లో ఆస్ట్రేలియా 226 బంతులు మిగులు ఉండగానే మ్యాచ్ గెలిచింది.అయితే 2001 వ సంవత్సరంలో ఇండియా 231 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.ఇక ప్రస్తుతం శ్రీలంక మీద 263 బంతులు మిగిలి ఉండగా గెలవడంతో ఇండియా రికార్డును ఇండియా నే మళ్లీ బ్రేక్ చేసింది. మొత్తానికి ఈ మ్యాచ్ లో చాలా రికార్డ్ లు బ్రేక్ అయ్యాయి అనే చెప్పాలి. ఏషియా కప్ ఫైనల్ అంటే రెండు జట్ల మధ్య మంచి టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ఇండియన్ బౌలర్లు మాత్రం మ్యాచ్ ని వన్ సైడ్ చేసేసారు…ముఖ్యంగా సిరాజ్ ఏషియా కప్ లో ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు.కానీ ఈ మ్యాచ్ లో మాత్రం చాలారేగిపోయాడు. అతని బౌలింగ్ ని ఎదుర్కోవడానికి శ్రీలంక టాప్ బ్యాట్స్ మెన్స్ కూడా తడబడ్డారు… ఇక ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీసినందుకుగాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సిరాజ్ నిలిచాడు.ఇక మొత్తం టోర్నమెంట్ లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చినందుకు గాను కుల్డిప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా నిలిచాడు…