ICC World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వరుస విజయాలను అందుకుంటూ ఆరు పాయింట్ల తో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు సెమీఫైనల్ కి వెళ్లే టీంలు ఏవి అనే దానిమీద భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడిన ఆస్ట్రేలియా టీం ఒక మ్యాచ్ లో కూడా గెలవలేక పోయింది.ఇక దానికి తోడుగా నిన్న ఆఫ్గనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీమ్ ఓడిపోవడం జరిగింది.ఇలా వరల్డ్ కప్ లో రోజుకొక ట్విస్ట్ జరుగుతుంది.ఇక ఇలాంటి క్రమంలో న్యూజిలాండ్, ఇండియా, సౌత్ ఆఫ్రికా లాంటి జట్లు వరుస విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక ఇప్పటికే ఇండియా ఆడిన మూడు మ్యాచ్ ల్లో కూడా మూడు మ్యాచ్ లు గెలవడం జరిగింది.ఇక సౌత్ ఆఫ్రికా రెండు మ్యాచ్ లు ఆడితే అందులో రెండు మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక పాకిస్తాన్ టీమ్ మూడు మ్యాచ్ లు ఆడితే అందులో రెండింటిలో గెలిచి ఒక దాంట్లో ఓడిపోయింది.
ఇలా టాప్ టీములు మొత్తం వరుసగా విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సందర్భంలో ఇండియా కూడా తన స్థాయి మేరకు పర్ఫామెన్స్ ఇస్తూ ఈ వరల్డ్ కప్ లోనే నెంబర్ వన్ టీం గా కొనసాగుతుంది. ఈ క్రమంలో సెమీఫైనల్ కి ఇండియా మాత్రం తప్పకుండా వెళుతుంది. ఇక ఇండియాతో పాటు వచ్చే ఆ మూడు జట్లు ఏవి అనేదాని మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇండియా తో పాటు న్యూజిలాండ్ కూడా సెమిస్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది.ఇక వీటితో పాటు గా ఇలాగే ఆడితే సౌత్ ఆఫ్రికా టీమ్ కి కూడా సెమీస్ కి వెళ్ళే అవకాశం అయితే ఉంది.ఇక ప్రస్తుతం చూస్తే ఈ మూడు జట్లకి సెమిస్ కి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.అయితే నాలుగొవ టీమ్ గా ఏ టీమ్ వచ్చే అవకాశం ఉంది అంటే పాకిస్థాన్ టీమ్ కి ఉంది.కానీ పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందొ ఎవరికి తెలియట్లేదు. కాబట్టి నాలుగో ప్లేస్ కోసం ఎవరు వస్తారు అనేది మనం కచ్చితంగా చెప్పలేం…ఎందుకంటే గత సంవత్సరం టైటిల్ నెగ్గిన ఇంగ్లాండ్ టీమ్ ఈ ఇయర్ భారీ అంచనాలతో బరిలోకి దిగింది.
అయినప్పటికీ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ మీద ఓడిపోయింది నిన్న జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోయింది.ఇలా ఇంగ్లాండ్ టీమ్ కి దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్ రేసులో లేకుండా పోతుంది. ఇక ఇలాంటి క్రమంలో సెమీస్ కి వెళ్లే జట్లు ఏవి అనే దానిమీద ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది.ఇండియా తో పాటు వచ్చే మూడు జట్లు ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం… ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఇంగ్లాండ్ సెమీస్ కి వెళ్ళడం చాలా వరకు కష్టమనే చెప్పాలి. అలాగే ఆస్ట్రేలియా టీమ్ కూడా వరుసగా ఓటమిలతో ఉండడం వల్ల వాళ్లు కూడా సెమీఫైనల్ రేసులో నిలుస్తారా లేదా అనేది ఇంకొక రెండు మ్యాచ్ లు జరిగితే కానీ తెలియదు అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఇండియా ఆడబోయే ఆరు మ్యాచ్ ల్లోకనీసం నాలుగు మ్యాచ్ లు గెలిచిన సరిపోతుంది. ఇండియా సెమీస్ కి వెళ్తుంది. ఇక మన అంచనా ప్రకారం ఇండియా,న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ జట్లు సెమిస్ కి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి…