World Cup 2023: ఇండియా లో వరల్డ్ కప్ జరుగుతున్నా నేపధ్యం లో ఇప్పటికే అన్ని జట్లు కూడా ఇండియా చేరుకున్నాయి.ఇక అందులో భాగంగా గానే అక్టోబర్ 5 వ తేదీ న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీం ల మధ్య జరగనున్న మ్యాచ్ తో వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవుతుంది.అయితే ప్రస్తుతం 10 టీములు వరల్డ్ కప్ లో తలపడుతున్నాయి. అందులో శ్రీలంక, నెదర్లాండ్ టీములు మాత్రం క్వాలిఫై మ్యాచ్ లు ఆడి అర్హత సంపాదించాయి.ఇక మిగిలిన ఎనిమిది జట్లు డైరెక్ట్ గా వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.ఇక ఇప్పుడు ఈ 10 టీముల్లో ఏ టీములు సెమిస్ లోకి వస్తాయి అనేది తెలియాలంటే ఈ 10 టీముల్లో ఒక్కో టీం లీగ్ స్టేజ్ లో తొమ్మిది మ్యాచులు ఆడుతుంది. అందులో 7 మ్యాచులు గెలిచిన టీం డైరెక్ట్ గా సెమి ఫైనల్ కి వెళ్తుంది.ఇక లేదు అంటే టాప్ ఫోర్ లో ఏ టీంలు ఉంటె ఆ టీం లు సెమిస్ లోకి చేరుకుంటుంది. ఒక వేళ రెండు టీంలకి సేమ్ పాయింట్స్ ఉంటే అలాంటప్పుడు రన్ రేట్ ని బేస్ చేసుకొని ఏ టీం కి ఎక్కువ రన్ రేట్ ఉంటె ఆ టీం సెమిస్ కి చేరుకుంటుంది…
ఇక సెమీస్ లోకి వచ్చిన నాలుగు టీముల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టీం కి ఫోర్త్ ప్లేస్ లో ఉన్న టీంకి మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ అనేది జరుగుతుంది.ఇక రెండు,మూడు స్థానాల్లో ఉన్నజట్ల మధ్య రెండొవ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో ఎవరైతే విజయం సాధిస్తారో ఆ రెండు టీంల మధ్య నవంబర్ 19 వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇక ఇప్పుడు ఈ టీములు ఉన్న ఫామ్ ని బట్టి చూస్తే అన్ని టీములు కూడా చాలా బాగా ఆడుతున్నాయి కాబట్టి ఏ టీంలు సెమీస్ కి చేరుకుంటాయి అనేది చెప్పడం కష్టమే. ఇండియా అయితే తప్పకుండ సెమీస్ కు వెళ్తుంది. ఇక మిగిలిన మూడు టీములు ఏవి అనేది మనం ఒకసారి చూసుకుంటే అందులో ఆస్ట్రేలియా టీం సెమీస్ లోకి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ టీం లో మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉండటం తో ఆ టీం చాలా వరకు స్ట్రాంగ్ గా ఉంది మొన్నఇండియా మీద జరిగిన సిరీస్ ఓడిపోయినప్పటికీ వాళ్ళకి సెమీస్ కి వచ్చే అవకాశాలు అయితే పుష్కలం గా ఉన్నాయి…
ఇక డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ టీం కి కూడా సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ టీం లో ఆల్ రౌండర్లు ఉండటం వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి… ఇక ఈ టీం తర్వాత న్యూజిలాండ్ టీం కి కూడా సెమీస్ కి చేరుకునే అవకాశాలు అయితే పుష్కలం గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వీళ్లు కూడా వరల్డ్ కప్ విన్నర్స్ అనే చెప్పాలి కానీ దురదృష్టం కొద్దీ ఇంగ్లాండ్ విజయం సాధించింది.ఇక వీటి తోపాటు సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది రీసెంట్ గా వీళ్లు ఆస్ట్రేలియా మీద సిరీస్ గెలిచి మంచి ఉత్సాహం మీద ఉన్నారు…
మన అంచనా ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కి వెళ్తాయి .ఇక వీటితో పాటు గా నాలుగోవ జట్టు గా ఇంగ్లాండ్ లేదా సౌత్ ఆఫ్రికా వచ్చే అవకాశం అయితే ఉంది…