Odi World Cup 2023: 2023 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సంవత్సరం క్రికెట్ ఆడుతున్న ప్రతి టీం కూడా అదిరిపోయే విజయాలను అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో 24 మ్యాచ్ ల్లో 21 సెంచరీలు నమోదయ్యాయి. ఇంతకుముందు ఏ వరల్డ్ కప్ సీజన్ లో కూడా నమోదు అవ్వలేదు .ఇంకా 24 మ్యాచ్ లు బ్యాలెన్స్ ఉండడంతో దాదాపు ఇంకొక 10 సెంచరీలు ఈ టోర్నీలో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ప్రతి దేశంలో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా సెంచరీలను అలవోక గా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొంతమంది ప్లేయర్లు అయితే రెండుసార్లు, మూడుసార్లు కూడా శతకాలను సాధించి వాళ్ళ టీం కి భారీ విజయాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా టీం కి చెందిన డికాక్ ఇప్పటికే మూడు సెంచరీలు చేసి సౌత్ ఆఫ్రికా టీం విజయంలో కీలక పాత్ర వహించాడు. అయితే ఈ క్రమంలో వార్నర్ కూడా ఇప్పటికే రెండు సెంచరీ లు చేసి తనదైన రీతిలో టీం కి వరుస విజయాలను అందించాడు. ఇండియాకు చెందిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా అద్భుతమైన సెంచరీ లు నమోదు చేసుకున్నారు. అలాగే కేల్ రాహుల్ ఆస్ట్రేలియా మీద సెంచరీ చేయాల్సింది కానీ స్కోర్ ఎక్కువగా లేకపోవడంతో 97 పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచాడు. అలాగే కోహ్లీ కూడా న్యూజిలాండ్ మీద జరిగిన మ్యాచ్ లో మరో సెంచరీ ని నమోదు చేయాల్సింది కానీ కొట్టాల్సిన స్కోర్ ఎక్కువగా లేకపోవడంతో 95 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు.
ఇలా ఇప్పటివరకు కొంతమంది ప్లేయర్లు సెంచరీలు మిస్ అయ్యాయి. కాబట్టి ఇంకొక రెండు , మూడు సెంచరీలు తగ్గిపోయాయి. లేకపోతే ఈ టోర్నీలో ఇంకా కొన్ని ఎక్కువ సెంచరీలు నమోదు అయ్యాయి…ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా శ్రీలంక మీద ఆడిన మ్యాచ్ లో వాళ్ళ ప్లేయర్లు ముగ్గురు సెంచరీలు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.ఇక ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో ఎవరెవరు సెంచరీలు చేశారో ఒకసారి వాళ్ళ వివరాలను తెలుసుకుందాం…
డికాక్ ఇప్పటికే మూడు సెంచర్లు చేసి ఈ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఇక డికాక్ తర్వాత డేవిడ్ వార్నర్ రెండు సెంచరీలు చేశాడు
ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అబ్దుల్లా షఫీక్, డేవిన్ కాన్వే, క్లాసెన్ ,దావూద్ మాలన్, మర్కరం, కుశల్ మెండిస్, గ్లెన్ మాక్స్ వెల్,రుసి వండర్ డసెన్,సదిర సమర విక్రమా,మహమ్మద్ రిజ్వన్, రచిన్ రవీంద్ర లాంటి ప్లేయర్లు సెంచరీలు చేసి ఇక జరగబోయే మ్యాచ్ లో కూడా అద్భుతాలను క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటున్నారు…
నిజానికి మిగతా ఏ టోర్నీ లో కూడా ప్లేయర్లు ఇంత అద్భుతంగా ఆడలేదు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్లేయర్లు కూడా క్రికెట్ మీద విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్న సమయంలో ప్లేయర్లు అందరూ అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇవ్వడం అందరికీ క్రికెట్ మీద పెరుగుతున్న అభిమానాన్ని కూడా చాలా క్లారిటీగా తెలియజేస్తుంది… ఇక ఇప్పటివరకు వరల్డ్ కప్ ఒక టోర్నీ లో రోహిత్ శర్మ 5 సెంచరీలను చేసి రికార్డును క్రియేట్ చేశాడు. మరి ఈ సంవత్సరం డికాక్ ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. మరి డికాక్ ఈ రికార్డును బ్రేక్ చేస్తాడా లేదా ఇంకెవరైనా ప్లేయర్లు బ్రేక్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే టోర్నీ మొత్తం ముగిసే వరకు వేచి చూడాల్సిందే…