Tollywood Heroes: టాలీవుడ్ ఇండస్ట్రీలో తన రేంజ్ ను పెంచుకుంటూ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలను అందిస్తుంది. ఈ సంవత్సరం స్టార్ హీరోల సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో బాలయ్య, చిరు ఉండగా.. దసరా బరిలో బాలయ్య, రవితేజ, విజయ్ దళపతి లు అలరించారు. ఇక ఈ సంవత్సరం ఇలా ఉంటే.. వచ్చే సంవత్సరం పోటీ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే సంవత్సరం ఏ సినిమాలు ఉన్నాయి? అందులో స్టార్ హీరోగా ఎవరు నిలుస్తారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్టార్ల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు ఏ రేంజ్ లో మారుమోగుతాయో తెలిసిందే. కానీ చిన్న సినిమాలు మాత్రం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు హైలెట్ అవుతూ.. ప్రేక్షకుల వద్ద సందడి చేస్తుంటాయి. ఇక 2024లో ఆరుగురు స్టార్ల సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఓ జి, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ చేజర్, అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ మారుతి సినిమాలు 2024 లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
వరుసగా ఈ సినిమాలన్నీ కూడా రిలీజ్ కు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇందులో ఏ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందనేది చెప్పడం కష్టమే.. ఎందుకంటే ఈ స్టార్లందరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ పక్కా.. కానీ స్టోరీ ఆకట్టుకోలేకపోతే మాత్రం బోల్తా పడక తప్పదు. గతంలో ప్రభాస్ సినిమాపై అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇలా వచ్చే ఏడాది గనుక ఏ స్టార్ అయినా బొక్క బోర్లా పడే పరిస్థితి కూడా ఉంది.
2024 వ సంవత్సరం సినిమా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇంకా అలాగే ట్రేడ్ పండితులకు సైతం ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తుంది అని ఇప్పటికే చాలా రకాలుగా చర్చలు జరుపుతున్నారు. అయితే 2024 వ సంవత్సరంలో ఉన్న టాప్ హీరోలందరిలో ఎవరు ఎక్కువ కలెక్షన్స్ ని రాబడతారనే విషయం మీద కూడా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ఒక సినిమా సక్సెస్ కావాలంటే ఎలాంటి హంగులు ఉండాలనే దానిమీద ఈ అన్ని సినిమాలు కూడా ఫోకస్ పెట్టి ప్రేక్షకులను అరవించడానికి వాళ్ల ప్లానింగ్ తో రెడీ చేసుకొని మన ముందుకు రాబోతున్నారు. మరి ఈ పోరులో విజయం సాధించేది ఎవరో చూడాలి. పుష్ప 2మీద భారీ అంచనాలు ఉండగా ఎన్టీఆర్ దేవర సినిమాపై అంతకు మించిన అంచనాలు ఉన్నాయి. మరో వైపు ప్రభాస్ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. మరి ఇలా అన్ని సినిమాలు కూడా మంచి టాక్ తోనే రాబోతున్నాయి. దీంతో ఏ స్టార్ హీరో ఆఫ్ ది 2024గా నిలుస్తారో చూడాలి.