https://oktelugu.com/

IPL 2025 : ఐపీఎల్‌లో పది జట్లకు సారథులు వీరేనా?

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజే సంచలనాలు నమోదయ్యాయి. రిషబ్‌ పంత్‌ అత్యధిక ధరను సొంతం చేసుకున్నాడు. టాప్‌ ప్లేయర్లు మొదటి రోజే అమ్ముడయ్యారు

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 25, 2024 / 03:42 PM IST

    IPL 2025

    Follow us on

    IPL 2025 :  ఐపీఎల్‌ 2025 సీజన్‌ సన్నాహాలు మొదలయ్యాయి. మెగా వేలం ద్వారా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి ఫ్రాంచైజీలు. నవంబర్‌ 24, 25 తేదీల్లో దుబాయ్‌లో వేలం నిర్వహిస్తున్నారు. తొలి రోజు వేలం పూర్తయింది. మొదటి రోజే సంచలనాలు నమోదయ్యాయి. భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ రికార్డు ధరకు అమ్మడయ్యాడు. స్రేయస్‌ అయ్యర్‌ కూడా మంచి ధర పలికింది. రాహుల్‌కు ఆశించిన రేటు రాలేదు. ఇక టాప్‌ ప్లేయర్లంతా తొలి రోజే అమ్ముడయ్యారు. ఇక ఐపీఎల్‌లో తలపడే కొన్ని జట్లకు ఇప్పటికే సారథులు ఉన్నారు. మరికొన్ని ఫ్రాంచైచీలకు కొత్త కెప్టెన్లు రానున్నారు. ఐపీఎల్‌ వెబ్‌సైట్‌లో మాత్రం ముంబై ఇండియన్స్‌కు మాత్రమే కెప్టెన్‌ పేరు ఉంది. మిగతా జట్లకు కొత్త రారథులు వస్తారా అన్న చర్చ జరుగుతోంది.

    ఏ జట్టుకు ఎవరు సారథి?
    చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టును గతేడాది రుతురాజ్‌ గైక్వాడ్‌ నడిపించారు. ఈసారి అతడిని రూ.18 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. అతడికే కెప్టెన్సీ ఇస్తారని తెలుస్తోంది. ధోనీకి పగ్గాలు అప్పగించే అవకాశాలు లేవు.

    – ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం గతేడాది రోహిత్‌శర్మను పక్కన పెట్టి జట్టు పగ్గాలను హార్దిక్‌ పాండ్యాకు అప్పగించింది. ఆ సీజన్‌లో ముంబై ఇంyì యన్స్‌ ప్రదర్శన ఘోరంగా ఉంది. ఈసారి అతడిని తప్పించి సూర్యకుమార్‌కు అప్పగించేఅవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎస్‌ వెబ్‌సైట్‌లో మాత్రం హార్దిక్‌ పాండ్యా పేరే ఉంది.

    – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌)కు గతేడాది పాట్‌ కమిన్స్‌ సారథ్యం వహించారు. అనూహ్యంగా ఎస్‌ఆర్‌హెచ్‌ను ఫైనల్‌కు చేర్చారు. అతడిని రిటైన్‌ చేసుకుని ఈసారి కూడా సారథిగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ను రూ.23 కోట్లకు దక్కించుకుంది.

    – రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్సీ సమస్య లేదు. కొన్ని సీజన్లుగా ఆ జట్టును సంజుశ్యాంసనే నడిపిస్తున్నాడు. భారత సంచలన ప్లేయర్‌ యశస్వి జైస్వాల్, రియాన్‌ పరాగ్, ద్రువ్‌ జురెల్, హెట్మయిర్, సందీప్‌ శర్మను రాజస్తాన్‌ రిటెయిన్‌ చేసుకుంది. అత్యధికంగా సంజు శ్యాంసన్‌తోపాటు యశస్వికి ధర పలికింది. వీరికి రూ.18 కోట్ల చొప్పున చెల్లించింది.

    – గుజరాత్‌ టైటాన్స్‌ రషీద్‌ఖాన్‌(రూ.18 కోట్లు) చెల్లించేందుకు ముందుకు రాగా, శుభ్‌మన్‌గిల్‌ను రూ.16.50 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. గతేడాది గిల్‌ గుజరాత్‌కు సారథ్యం వహించాడు. ఈసారి కూడా మేనేజ్‌మెంట్‌ అతడినే కొనసాగించే అవకాశం ఉంది. చివరి నిమషంలో ఏదైనా జరిగితే తప్ప మార్పు ఉండదు.

    ఈ జట్లకు నూతన సారథ్యం?

    రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు డూప్లెసిస్‌ను వదిలేసింది. దీంతో కెప్టెన్సీ సమస్య ఎదురైంది. ఆ జట్ట అంటిపెట్టుకున్న విరాట్‌ కోహ్లికి మాత్రమే మళ్లీ సారథ్యం సామరథ్యం ఉంది. మళీ అతను కెప్టెన్సీ బాద్యతలు చేపడతారాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. డుప్లెసిస్‌ను చైట్‌ టూ మ్యాచ్‌లో తీసుకునే అవకాశం ఉంది. మేనేజ్‌మెంట్‌ మాత్రం కోహ్లివైపే మొగ్గు చూపుతోంది.

    – ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పరిస్థితి బెంగళూరు కన్నా భిన్నంగా ఉంది. గత జీసన్‌లో విజేతగా నిలిపిన శ్రేయస్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ వదిలి పెట్టింది. వేలంలో కూడా తీసుకోలేదు. పంత్‌ లేదా కేఎల్‌.రాహుల్‌ను తీసుకుంటారని ఊహించగా దకి ్కంచుకోలేదు. అనూహ్యంగా వెంకటేశ్‌ అయ్యర్‌(రూ.23.75 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది. గత సీజన్‌లోవెంకటేశ్‌ ఐయ్యర్‌ కేకేఆర్‌కు ఆడాడు. జట్టులో సీనియర్‌కు సారథ్యం అప్పగించే అవకాశం ఉంది.

    – లఖన్‌పూర్‌ సూపర్‌ జెయింట్స నుంచి బయటు వచ్చేసిన కేఎల్‌.రాహుల్‌ను ఢిల్లీ రూ.14 కోట్లకు దక్కించుకుంది. అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో అక్షర్‌ పటేల్‌ కూడా సారథి రేసులో ఉన్నాడు. అతడిని ఢిల్లీ రూ.16.50 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. కేఎల్‌ కే సారథ్యం అప్పగిస్తారని సమాచారం.

    ఇక లకన్‌పూర్‌ సూపర్‌ జెయిట్స్‌ గత సీజన్‌లో అత్యంత వివాదాస్పదమైన కెపన్టెన్, ఓనర్‌ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కెఎల్‌.రాహుల్‌ బయటకు వెళ్లాడు. వేలంలో రిషబ్‌ పంత్‌ను లక్నో సూపరల్‌ జెయింట్స్‌ రూ.27 కోట్లకు దక్కించుకుంది. సారథ్య అనుభవం కలిగిన అతడికే జట్టు పగ్గాలు కూడా అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు నికోలస్‌ పూరణ్‌ కూడా రేసులో ఉన్నాడు. ఇతడిని ఫ్రాంచైజీ రూ.21 కోట్లు చెల్లించి రిటైన్‌ చేసుకుంది.

    చివరగా పంజాబ్‌ కింగ్స్‌.. దాదాపు జట్టు మొత్తాన్ని మార్చింది. అందుకు తగినట్లు నిధులు అట్టిపెట్టుకుంది. ఐపీఎల్‌ – 2024 సీజన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌ అయ్యర్‌ను పంజాబ్‌ కొనుగోలు చేసింది. అతడి కోసం రూ.26.75 కోట్లు చెల్లించింది. దీంతో అతడికే కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది. ఈ జట్టు మేనేజ్‌మెంట్‌ చహల్, అర్షదీప్‌ సింగ్‌ను కూడా కొనుగోలు చేసింది.