https://oktelugu.com/

Mahesh Babu And Krishna: ఆ డైరెక్టర్ కి వరుసగా ఐదు ప్లాప్స్, మహేష్ విషయంలో పెద్ద రిస్క్ చేసిన కృష్ణ!

ప్లాప్స్ ఉన్న దర్శకులను హీరోలు పట్టించుకోరు. ఒక బ్లాక్ బస్టర్ కొడితే కానీ మరలా నమ్మరు. కానీ కృష్ణ కొడుకు మహేష్ విషయంలో రిస్క్ చేశాడు. వరుసగా ఐదు ప్లాప్స్ ఇచ్చిన దర్శకుడితో మహేష్ సినిమా సెట్ చేశాడు. మరి ఆ సినిమా ఫలితం ఏమిటీ? ఇంట్రెస్టింగ్ స్టోరీ..

Written By:
  • S Reddy
  • , Updated On : November 25, 2024 / 03:35 PM IST

    Mahesh Babu And Krishna

    Follow us on

    Mahesh Babu And Krishna: సూపర్ స్టార్ కృష్ణ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేశాడు. డేరింగ్ డాషింగ్ హీరోగా అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన రాణించారు. కొత్త సాంకేతికతను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. కృష్ట తన ఇద్దరు కుమారులను కూడా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ముఖ్యంగా మహేష్ బాబును చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసిన అనేక చిత్రాలు చేశారు. మహేష్ బాబు తండ్రి కృష్ణకు కొడుకుగా, తమ్ముడిగా నటించడం విశేషం. కృష్ణ, మహేష్ బాబు, పెద్ద కుమారుడు రమేష్ బాబు సైతం కలిసి చిత్రాలు చేశారు.

    చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్డం అనుభవించిన ఏకైక హీరో మహేష్ బాబు. డ్యూయల్ రోల్ కూడా చేయడం విశేషం. హీరోగా ఆయన 1999లో రాజకుమారుడు చిత్రంతో పరిచయం అయ్యాడు. కాగా ఈ చిత్రానికి కే రాఘవేంద్రరావు దర్శకుడు. ఆయన బడా దర్శకుడు, అనేక ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. అయితే రాజకుమారుడు మూవీ టైం కి రాఘవేంద్రరావు ప్లాప్స్ లో ఉన్నారు.

    అన్నమయ్య మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రాఘవేంద్రరావు.. అనంతరం మేరా సప్నో కి రాణి, శ్రీమతి వెళ్ళొస్తా, లవ్ స్టోరీ 1999, ఇద్దరు మిత్రులు చేశారు. ఇవ్వన్నీ వరుసగా డిజాస్టర్స్. అలాంటి టైం లో హీరోగా మహేష్ ని పరిచయం చేసే బాధ్యత ఆయనకు ఇవ్వడం సాహసమే. కానీ రాఘవేంద్రరావు ప్రతిభ మీద నమ్మకం ఉన్న కృష్ణ… మహేష్ ని హీరోగా సిల్వర్ స్క్రీన్ పై మొదటిసారి చూపించే బాధ్యత ఆయనకు ఇచ్చారు.

    కృష్ణ నమ్మకాన్ని నిలబెడుతూ.. రాఘవేంద్ర రావు సూపర్ హిట్ ఇచ్చాడు. రాజకుమారుడు మూవీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కృష్ణ గెస్ట్ రోల్ చేశాడు. ప్రకాష్ రాజ్ కీలక రోల్ చేశాడు. మణిశర్మ సాంగ్స్ ఈ చిత్రానికి హైలెట్. ప్రతి పాట బాగుంటుంది. ప్రీతి జింటా హీరోయిన్ గా నటించింది. మహేష్-ప్రీతి జింటా కెమిస్ట్రీ బాగా కుదిరింది. మహేష్ కెరీర్ కి రాజకుమారుడు మూవీ మంచి పునాది వేసింది. మరలా కే రాఘవేంద్రరావు కాంబోలో మహేష్ మూవీ రాలేదు. ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయిన కే రాఘవేంద్రరావు సినిమాలు చేయడం లేదు.