https://oktelugu.com/

Hari Hara Veera Mallu: సోషల్ మీడియా ని ఊపేస్తున్న ‘హరి హర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్..సంబరాల్లో ఫ్యాన్స్!

ఈ చిత్రాన్ని మార్చి 28 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు ఇటీవలే ఒక సరికొత్త పోస్టర్ ద్వారా నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో విడుదల చేయగా, అది తెగ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఒక ముసలాయన తో ప్రేమగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్న ఈ ఫోటో నేడు షూటింగ్ సెట్స్ లో తీసినది గా చెప్తున్నారు మేకర్స్.

Written By: , Updated On : September 25, 2024 / 09:35 PM IST
Hari Hara Veera Mallu(1)

Hari Hara Veera Mallu(1)

Follow us on

Hari Hara Veera Mallu: రాజకీయాల్లో గత ఏడాది నుండి ఫుల్ బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయ్యాక మరింత బిజీ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆయన రాజకీయాల్లో యాక్టీవ్ కాకముందు మూడు సినిమాలు ఒప్పుకొని 50 శాతం కి పైగా షూటింగ్స్ ని పూర్తి చేసాడు. ఇప్పుడు మిగిలిన బ్యాలన్స్ షూటింగ్స్ ని పూర్తి చేసేందుకు ఇప్పుడు తన నిర్మాతలకు పిలిచి డేట్స్ ఇచ్చాడు. ముందుగా ఆయన ‘హరి హర వీరమల్లు’ సినిమాకి డేట్స్ కేటాయించాడు. గత మూడు రోజుల నుండి ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 80 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, కేవలం ఆయన పార్ట్ కి సంబంధించి 20 రోజులు మాత్రమే మిగిలింది. అక్టోబర్ 10 లోపు షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ఈ చిత్రాన్ని మార్చి 28 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు ఇటీవలే ఒక సరికొత్త పోస్టర్ ద్వారా నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో విడుదల చేయగా, అది తెగ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఒక ముసలాయన తో ప్రేమగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్న ఈ ఫోటో నేడు షూటింగ్ సెట్స్ లో తీసినది గా చెప్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. పవన్ కళ్యాణ్ ని ఇలాంటి పీరియడ్ జానర్ చిత్రాల్లో ఇప్పటి వరకు అభిమానులు చూడలేదు. అందుకే ఈ సినిమా పై వారిలో ఎంతో ఆసక్తి ఉంది. కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద ఉన్న అంచనాలు వేరు. అయితే మధ్యలో షూటింగ్స్ కి అత్యధికంగా బ్రేకులు రావడంతో హైప్ కాస్త తగ్గింది.

కానీ నేడు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ ని చూసిన తర్వాత సినిమా పై అంచనాలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. ఇక అక్టోబర్ నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందట. దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఆరోజుల్లో ఔరంగజేబు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలకు గురి అయ్యారు. వారి నుండి సంపద దోచుకొని పేదలకు పంచి పెట్టే విధంగా ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందట. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.