మిగిలిన ఐపీఎల్ ఇక్కడే.. బీసీసీఐ ప్రకటన

కరోనా కల్లోలంతో ఆగిపోయిన ఐపీఎల్ మిగిలిన సీజన్ ను నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్-అక్లోబర్ లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ ఏడాది చివర్లో భారత్ లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీపై నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజులు గడువును బీసీసీఐ […]

Written By: NARESH, Updated On : May 29, 2021 6:00 pm
Follow us on

కరోనా కల్లోలంతో ఆగిపోయిన ఐపీఎల్ మిగిలిన సీజన్ ను నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్-అక్లోబర్ లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇక ఈ ఏడాది చివర్లో భారత్ లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీపై నిర్ణయం తీసుకునేందుకు మరో నెల రోజులు గడువును బీసీసీఐ కోరింది. ఈ మేరకు ఐసీసీకి విన్నవించింది.

భారత్ లో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆ ఉపద్రవం రాకుంటే అక్టోబర్-నవంబర్ నెలలో టీ20 ప్రపంచకప్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే ఒక నెలరోజులు ఐసీసీని గడువు కోరింది.

ఐపీఎల్ 14 వ సీజన్ లో ఇప్పటికీ 29 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇంకా 31 మ్యాచ్ లున్నాయి. సగం ఐపీఎల్ మిగిలి ఉంది. వాటిని సెప్టెంబర్ 18 లేదా 19న ప్రారంభించి అక్టోబర్ 9 లేదా 10న ఫైనల్ తో ముగించాలని బీసీసీఐ అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనుంది.