https://oktelugu.com/

చిత్తూరు జిల్లాలో నియంత మంత్రి?

చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి తన కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండా విధానపరమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టాలంటే కొవిడ్ నెగెటివ్ రిపోర్టు లేకుండా వస్తే అనుమతి నిరాకరిస్తున్నారు. మంత్రి ఆదేశాలు ధిక్కరిస్తే అంతే సంగతి. నిజానికి ఒక జిల్లాకు మరో జిల్లాకు మంత్రుల ఆదేశాలు సహజమే. కానీ ఇక్కడ అంతర్రాష్ర్ట సరిహద్దులు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తే వాలిడిటీ ఉంటుంది. ఏపీ వాసుల్ని […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 29, 2021 / 05:49 PM IST
    Follow us on

    చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి తన కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండా విధానపరమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టాలంటే కొవిడ్ నెగెటివ్ రిపోర్టు లేకుండా వస్తే అనుమతి నిరాకరిస్తున్నారు.

    మంత్రి ఆదేశాలు ధిక్కరిస్తే అంతే సంగతి. నిజానికి ఒక జిల్లాకు మరో జిల్లాకు మంత్రుల ఆదేశాలు సహజమే. కానీ ఇక్కడ అంతర్రాష్ర్ట సరిహద్దులు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తే వాలిడిటీ ఉంటుంది.

    ఏపీ వాసుల్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఉంటేనే రానిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎవరో మంత్రి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ లాంటి రాష్ర్టాలు కూడా అధికారికంగా ఆంక్షలు విధించాయి. ఏపీ సర్కారు మాత్రం లాక్ డౌన్ సమయం నిబంధనలు మినహా ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే ఎవరినైనా ఏపీలోకి రానిస్తామన్న నిబంధనలు పెట్టలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి చెప్పిందే వేదం అన్నట్లుగా చెబుతున్నారు.

    చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కంట్రోల్ చేయడానికి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే రానివ్వడమే మేలని నిర్ణయింుకుని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మంత్రులు కాస్త పలుకుబడి ఉన్న వారందరు ఇలా ప్రాంతాలుగా పంచేసుకుని సొంత ప్రభుత్వాలు నడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ఎందుకు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.