Odi World Cup 2023: వరల్డ్ కప్ లో నమోదైన రికార్డ్స్… మనల్ని తీవ్రంగా నిరాశ పరిచిన మ్యాచు లు ఇవే…

రుసగా రెండుసార్లు వరల్డ్ కప్ ని అందుకున్న కెప్టెన్లలలో మొదటగా 1975, 1979 వ సంవత్సరంలో వెస్టిండీస్ ని విజేతగా నిలిపిన కెప్టెన్ అయిన క్లివ్ లాయిడ్ ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు,ఇక 1983 వ సంవత్సరం లో కూడా ఆయన వెస్టిండీస్ టీమ్ ని ఫైనల్ కి తీసుకు వచ్చాడు.

Written By: Gopi, Updated On : October 25, 2023 1:11 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ అంటే ప్రతి టీం కూడా తమ అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ వాళ్ళ ఎంటైర్ లైఫ్ లో ఒక్కసారైనా వరల్డ్ కప్ కొట్టాలి అనే ఉద్దేశ్యం తో బరిలోకి దిగుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రతి టీం కూడా తమదైన రీతిలో బెస్ట్ పర్ఫామెన్స్ ని ఇస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఆడుతున్న వరల్డ్ కప్ లో కూడా ఇండియన్ టీం వరుస విజయాలను అందుకుని సెమీస్ కి వెళ్ళే టీముల్లో మొదటి వరుసలో ఉంది. ఇక ఇలాంటి క్రమంలో మొత్తం వరల్డ్ కప్ లో నమోదైన కొన్ని అరుదైన రికార్డులు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇప్పటివరకు వరల్డ్ కప్ లో చేసిన హైయెస్ట్ ఇండివిజల్ స్కోర్ సౌతాఫ్రికా టీం పేరు మీద నమోదయింది. రీసెంట్ గా శ్రీలంక మీద జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లను కోల్పోయిన సౌతాఫ్రికా టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 428 పరుగులు చేసింది. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఇదే హైయెస్ట్ ఇండివిజ్యుల్ స్కోర్ గా ఉంది…ఇక ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టీమ్ కి చెందిన ముగ్గురు ప్లేయర్లు సెంచరీ లు చేసి ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు…

ఇక ఇప్పటివరకు వరల్డ్ కప్ ఫైనల్లో 300 ప్లస్ రన్స్ చేసిన టీమ్ గా ఆస్ట్రేలియా రికార్డ్ ని క్రియేట్ చేసింది. 2003 ఇండియా తో ఆడిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం 359 పరుగులను చేసింది.ఆస్ట్రేలియా తప్ప ఇప్పటి వరకు ఏ టీమ్ కూడా వరల్డ్ కప్ ఫైనల్ లో 300 స్కోర్ చేయలేదు…

ఇక వరల్డ్ కప్ లో ఒక ప్లేయర్ ఇండివిజ్యుల్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి మార్టిన్ గుప్తిల్ పేరు మీద నమోదయింది. ఆయన 2015 లో వెస్టిండీస్ మీద ఆడిన ఒక మ్యాచ్ లో 237 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు…

ఇక ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో హైయెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ గా ఆస్ట్రేలియా కి చెందిన గ్లెన్ మెగ్రాత్ మొదటి స్థానంలో ఉన్నాడు.ఈయన ఇప్పటివరకు 71 వికెట్లను తీశాడు…

ఇక వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా ఇండియన్ టీంకు చెందిన రోహిత్ శర్మ పేరు మీద ఒక రికార్డు అనేది నమోదయింది.అలాగే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు అత్యధికం గా ఏడు సెంచరీలను చేశాడు.ఒక టోర్నీలో హైయెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా కూడా రోహిత్ శర్మ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.ఇక 2019లో ఆయన టోర్నీలో ఐదు సెంచరీలు చేసి ఈ ఘనతను సాధించాడు…

ఇక వరుసగా రెండుసార్లు వరల్డ్ కప్ ని అందుకున్న కెప్టెన్లలలో మొదటగా 1975, 1979 వ సంవత్సరంలో వెస్టిండీస్ ని విజేతగా నిలిపిన కెప్టెన్ అయిన క్లివ్ లాయిడ్ ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు,ఇక 1983 వ సంవత్సరం లో కూడా ఆయన వెస్టిండీస్ టీమ్ ని ఫైనల్ కి తీసుకు వచ్చాడు.కానీ ఫైనల్ లో ఇండియా తో తలపడిన ఈ టీమ్ ఇండియా మీద ఓడిపోయింది…

ఇక 2003 ,2007 వ సంవత్సరంలో ఆస్ట్రేలియా టీం కి వరుసగా 2 సార్లు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా రికీ పాంటింగ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక వీళ్లిద్దరిని మినహాయిస్తే మరే కెప్టెన్ కూడా వరుసగా రెండుసార్లు వరల్డ్ కప్పు గెలుచుకోలేదు…

ఇక వరల్డ్ కప్ లో ఆయా దేశాల అభిమానుల్ని తీవ్రం గా అప్సెట్ చేసిన మ్యాచ్ లు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…

2003 వ సంవత్సరంలో ఇండియా ఫైనల్ కి వెళ్ళింది ఇక ఫైనల్ లో ఆస్ట్రేలియా టీమ్ తో ఇండియా పోటీ పడినప్పటికి ఆస్ట్రేలియా టీం మీద ఓడిపోయి ఇండియన్ అభిమానులకి నిరాశను మిగిల్చింది…

ఇక 2007వ సంవత్సరంలో బంగ్లాదేశ్ మీద ఇండియన్ టీం ఓడిపోయి సెమీస్ కి వెళ్లకుండా లీగ్ దశనుంచే వెనుతిరగాల్సి వచ్చింది.ఇండియన్ టీమ్ కి ఇదొక బిగ్ మైనస్ అనే చెప్పాలి.

2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, పాకిస్తాన్ రెండు టీములు కూడా 11 పాయింట్లతో ఉన్నప్పటికీ కొద్దిపాటి రన్ రేట్ న్యూజిలాండ్ కి మెరుగ్గా ఉండటం వల్ల న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కి చేరుకుంది.దాంతో పాకిస్థాన్ మాత్రం ఇంటి ముఖం పట్టింది…

2019 సెమి ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ మీద ఓడిపోయి ఇండియన్ క్రికెట్ అభిమానులందరికీ తీవ్రమైన నిరాశని మిగిల్చిందనే చెప్పాలి…