KL Rahul- Jasprit Bumrah: ఆసియాకప్–2023 ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీతో టీమిండియాలోకి ఇద్దరు స్టార్ క్రికెటర్లు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాట్లు తెలుస్తోంది. క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా, కేఎల్.రాహుల్ ఆసియాకప్‌లో ఆడతారని తెలుస్తోంది. వీరితోపాటు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) రిహాబ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అతని రీఎంట్రీకి మరింత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
ఆరు నెలలుగా బూమ్రా దూరం..
వెన్ను సమస్య కారణంగా 2022, సెప్టెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న బూమ్రా.. ఇటీవలే పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అతను నెట్స్‌లో అవిశ్రాంతంగా 7 నుంచి 9 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఐపీఎల్‌లో రాహుల్‌కు గాయం..
మరోవైపు ఐపీఎల్–2023 సందర్భంగా కేఎల్.రాహుల్ గాయపడ్డాడు. ప్రస్తుతం అయన కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలిసింది. అయితే ప్రాక్టీస్ ప్రారంభించేందుకు మరో వారం సమయం పట్టవచ్చని సమాచారం.
కోలుకోని అయ్యర్..
ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ విషయానికొస్తే.. చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. గాయానికి తగిన చికిత్స తీసుకుంటున్నా కోలుకోలేదని తెలుస్తుంది. అయ్యర్ ఇంకా ఇంజెక్షన్లపైనే ఉన్నాడని సమాచారం. కొందరేమో అయ్యర్ వరల్డ్‌కప్ సమయానికి కోలుకోవడం కూడా అనుమానమేనని అంటున్నారు.
ప్రత్యామ్నాయంపై బీసీసీఐ దృష్టి..
అయ్యర్ కోలుకునే అవకాశం కనిపించకపోవడంతో బీసీసీఐ టీమిండియా మిడిలార్డ ప్లేస్ భర్తీకి ప్రత్యామ్నాయం వెతుకుతోంది. ఐపీఎల్‌లో సత్తా చాటిన క్రికెటర్ల లిస్ట్ పరిశీలిస్తోంది. అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అంటే సెప్టెంబర్ వరకు అయ్యర్ కోలుకోకుంటే.. మరొకరిని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. నెల రోజుల ముందే జట్టును ఎంపిక చేసి క్యాంప్ నిర్వహించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ నేపథ్యంలో అయ్యార్ ప్లేస్ రీప్లేస్ చేయడమే మేలని భావిస్తున్నట్లు సమాచారం.