Rohith Sharma Using Mobile
Rohith Sharma : అంతటి డబ్బున్నప్పటికీ.. ఏదైనా కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ రోహిత్ సింప్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తున్నాడు.. సాధారణంగా క్రికెటర్లు అత్యంత ఖరీదైన ఫోన్లు వాడుతుంటారు. వాహనాల విషయంలోనూ అదే లగ్జరీతనాన్ని ప్రదర్శిస్తుంటారు.. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు. వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ.. టీమిండియా కు కెప్టెన్ అయినప్పటికీ.. ప్రకటనల ద్వారా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ.. ఏమాత్రం లగ్జరీతనాన్ని ప్రదర్శించడం లేదు. పైగా సింప్లిసిటీ మాత్రమే కోరుకుంటున్నాడు. దానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇప్పుడు నెట్టింట దీని గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల రోహిత్ శర్మ కటక్ వన్డేలో సూపర్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ 119 పరుగులు చేయడంతో.. ఇంగ్లాండ్ విధించిన 300+ టార్గెట్ కూడా టీం ఇండియాకు పెద్దగా కష్టం కాలేక పోయింది. ఈ విజయం ద్వారా టీం ఇండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ గెలుచుకుంది. ఈ క్రమంలో సెంచరీ చేసిన అనంతరం రోహిత్ శర్మ మైదానంలో ఫోన్ లో మాట్లాడాడు.
వాడుతోంది అదే ఫోన్
రోహిత్ శర్మ మైదానంలో ఫోన్ మాట్లాడుతుండగా కొంతమంది ఫోటోలు తీశారు. ఆ ఫోటోలో రోహిత్ శర్మ వాడుతున్న ఫోన్ వన్ ప్లస్ 12 ( one plus 12) అని తేలింది. ఈ ఫోన్ ధర బహిరంగ మార్కెట్లో 58 నుంచి 61 వేలు ఉంటుంది.. వాస్తవానికి ఈ రోజుల్లో మామూలు ఉద్యోగం చేసేవారు కూడా ఐ ఫోన్ వాడుతున్నారు.. దానిని కొనే సామర్థ్యం లేకపోయినప్పటికీ.. ఈఎంఐ లు చెల్లిస్తూ సొంతం చేసుకుంటున్నారు. అయితే వందల కోట్లకు అధిపతి అయినప్పటికీ.. టీమ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నప్పటికీ.. రోహిత్ శర్మ వన్ ప్లస్ 12 ఫోన్ వాడటం చర్చకు దారితీస్తోంది. ” రోహిత్ అద్భుతమైన ఆటగాడు. అంతకుమించి ఆస్తిపరుడు. అయినప్పటికీ లో లెవల్ మైంటైన్ చేస్తున్నాడు. అటువంటి ఆటగాడు వన్ ప్లస్ 12 ఫోన్ వాడటం నిజంగా ఆశ్చర్యకరం. రోహిత్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఎంతటి ఫోన్ అయినా వాడగలడు. కాకపోతే అతడు డౌన్ టు ఎర్త్ లాగా వ్యవహరిస్తున్నాడు. అందువల్లే అతడంటే చాలామంది ఇష్టపడతాడరని ” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రోహిత్ ఎక్కువగా ఫోన్ ఉపయోగించడని.. ఖాళీ సమయం దొరికితే నిద్ర పోతాడని.. కుటుంబంతో గడపడానికి ఇష్టపడతాడని.. అందువల్లే అతడు తక్కువ ధర ఉన్న ఫోన్ వాడుతున్నాడని తెలుస్తోంది. మరోవైపు రోహిత్ వన్ ప్లస్ 12 ఫోన్ లో మాట్లాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.