Naga Chaitanya , Sobhita Dhulipala
Naga Chaitanya : అక్కినేని కుటుంబానికి శోభిత దూళిపాళ్ల(Sobhita Dhulipala) అదృష్ట దేవత అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత నాగ చైతన్య(Akkineni Nagachaitanya) నుండి విడుదలైన ‘తండేల్(Thandel Movie)’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ అక్కినేని అభిమానుల్లో నింపిన జోష్ మామూలుది కాదు.ఎందుకంటే గత కొంత కాలం గా అక్కినేని హీరోలకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. కనీసం పది కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్స్ ని కూడా ఆ సినిమాలు ఫుల్ రన్ లో రాబట్టలేకపోయాయి. ఇక అక్కినేని ఫ్యామిలీ పని అయిపోయింది అంటూ అందరూ అనుకుంటున్నా సమయంలో ‘తండేల్’ చిత్రం కొత్త ఊపిరి నింపింది. ఇదంతా శోభితా అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టడం వల్లే జరిగింది అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే కాంట్రవర్సీలకు దూరంగా ఉండే శోభిత పై సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ జరిగిన సంగతి తెలిసిందే.
N కన్వెన్షల్ మాల్ ని కూల్చేసినప్పుడు శోభిత వల్లే ఈ అరిష్టం జరిగింది అంటూ సోషల్ మీడియా లో అనేకమంది కామెంట్స్ చేసారు. అదే విధంగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అధికారిక ప్రకటన చేసిన సమయంలో అనేక మంది శోభిత నాగ చైతన్య జీవితంలోకి రావడం వల్లే, సమంత తో విబేధాలు ఏర్పడి విడిపోయాడని, పాపం సమంత అన్యాయానికి గురైందని కామెంట్స్ చేసేవారు. ఇవి బాగా వైరల్ అవ్వడంతో శోభిత, నాగ చైతన్య వరకు ఈ కామెంట్స్ వెళ్లాయి. దీనికి నాగ చైతన్య ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో స్పందిస్తూ చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఏ పాపం తెలియని శోభిత మీద కూడా లేనిపోని నిందలు వేస్తున్నారు. నేను, సమంత విడిపోవడానికి ఆమె అసలు కారణం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.
మీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు కదా, మీ మధ్య పరిచయం ఏర్పడి పెళ్లి దాకా ఎలా మ్యాటర్ వెళ్ళింది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘మా పరిచయం ఇంస్టాగ్రామ్ లో చాటింగ్ ద్వారా మొదలైంది. ఆ తర్వాత మొట్టమొదటిసారి కాఫీ షాప్ లో కలుసుకున్నాం. అలా మా ఇద్దరి జర్నీ మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. దయచేసి ఇకనైనా కాంట్రవర్సీలలోకి ఆడవాళ్లను లాగొద్దని, దీనికి నేను ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేనని, మీరే ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ కి యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం అఖీకినేని అభిమానులు మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ ఇంటర్వ్యూ ని చూసి నాగ చైతన్య ని మెచ్చుకుంటున్నారు.