https://oktelugu.com/

Odi World Cup 2023: వరల్డ్ కప్ టాప్ లో నిలిచిన జట్టేది కప్ కొట్టలేదు.. ఈసారి టీమిండియా బ్రేక్ చేస్తుందా?

2011 నుంచి 2019 వరకు ఇండియా 3 వరల్డ్ కప్ లను ఆడింది. అయితే 2011 వన్డే ప్రపంచకప్ లో ఇండియా టైటిల్ గెలిచిన విషయం మనకు తెలిసిందే..

Written By: , Updated On : November 8, 2023 / 12:37 PM IST
Odi World Cup 2023

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: ఒక్కప్పుడు ప్రపంచ దేశాలు వాళ్ల లెక్కలోకి తీసుకోని ఇండియన్ క్రికెట్ టీమ్ ఇప్పుడు మాత్రం ప్రపంచ క్రికెట్ వ్యవస్థని శాశిస్తుంది…ఒక రాజ్యాన్ని ఆక్రమించిన రాజు గర్వం అతని శిరస్సు మీద ఒదిగి ఉన్న కిరీటం లో దాగి ఉంటుంది, అదే ఒక ప్లేయర్ సాధించిన గెలుపులోని గర్వం రెపరెపలాడే ఆ దేశపు జెండా లో ఒదిగి ఉంటుంది…మన ప్లేయర్లను ఎలా ఎదుర్కోవాలి అనే భయం ప్రత్యర్థి ప్లేయర్ల గుండెల్లో కలుగుతుంది అంటే మన ప్లేయర్లు చూపిస్తున్న తెగువ కి అదో నిదర్శనం గా చెప్పాలి…కింగ్ ఎప్పుడు నెంబర్ వన్ లోనే ఉంటాడు అనే మాట కి జస్టిఫికేషన్ ఇస్తు ప్రస్తుతం ఇండియన్ టీమ్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది… కానీ కొన్నిసార్లు ప్రత్యర్థి బలం కంటే మన బలం అధికంగా ఉండటం కూడా మన బలహీనతగా మారవచ్చు… నెంబర్ వన్ లో ఉండటం మనకు కలిసి రాదా కప్పు కొట్టాలంటే మనం నెంబర్ వన్ ని త్యాగం చేయాల్సిందేనా..? అనే విషయాల మీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.వాటికి సంభందించిన విషయాలను మనం ఒకసారి క్లారిటీ గా తెలుసుకుందాం…

2011 నుంచి 2019 వరకు ఇండియా 3 వరల్డ్ కప్ లను ఆడింది. అయితే 2011 వన్డే ప్రపంచకప్ లో ఇండియా టైటిల్ గెలిచిన విషయం మనకు తెలిసిందే..ఇక అప్పుడు మ్యాచ్ లు రెండు గ్రూపులుగా జరిగాయి అందులో గ్రూప్ ఎ లో పాకిస్తాన్ టాప్ ప్లేస్ లో నిలిచింది. గ్రూప్ బి లో సౌతాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. ఇక అప్పుడు ఈ రెండు టీమ్ లు కూడా సెమీస్ లో ఓడిపోయాయి.దాంతో ఈ రెండు జట్లు కాకుండా వన్డే వరల్డ్ కప్ ని ఇండియా కైవసం చేసుకుంది…

ఇక 2015 లో జరిగిన వరల్డ్ కప్ లో మ్యాచ్ లు రెండు గ్రూప్ లుగా ఆడాయి. అందులో గ్రూప్ ఎ లో న్యూజిలాండ్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ గ్రూప్ లో నెంబర్ వన్ పొజిషన్ ని సొంతం చేసుకోగా, గ్రూప్ బి లో భారత్ టేబుల్ టాపర్ గా నిలిచింది. అయితే ఆస్ట్రేలియా మాత్రం అప్పుడు వరల్డ్ కప్ ని సొంతం చేసుకొని ప్రపంచ కప్ హిస్టరీ లోనే 5 వ సారి వరల్డ్ కప్ ని అందుకున్న టీమ్ గా చరిత్ర లోకి ఎక్కింది…

ఇక అదే సమయం లో 2019 లో కూడా ఇండియన్ టీమ్ లీగ్ దశలో నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. అప్పుడు ఇండియా న్యూజిలాండ్ టీమ్ మీద సెమీస్ లో ఓడిపోయి ఆ టోర్నీ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది…ఇక అందులో భాగంగానే ఇపుడు కూడా ఇండియా నెంబర్ వన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇండియన్ అభిమానులు కూడా మళ్ళీ ఇండియా సెమీస్ లో కానీ, ఫైనల్ లో కానీ ఓడిపోవాల్సి వస్తుందా? అనే ఒక చిన్న పాటి ఆందోళనలో ఉన్నారు.నిజానికి అలాంటిది ఏమీ జరగదు ఇండియన్ టీమ్ ఈసారి పక్కాగా కప్పు కొడుతుంది అంటూ సీనియర్ ప్లేయర్లు సైతం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు…