PM Modi : పూర్తి జోష్ నింపిన మోడీ స్టేడియం ప్రసంగం

అన్నింటికంటే ముఖ్యమైనది.. తెలంగాణలో చర్చనీయాంశమైనది మోడీ ప్రస్తావించారు. తెలంగాణలో చోటు చేసుకున్న అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతాయని.. తప్పు చేసిన వారిని వదలమని మోడీ హెచ్చరించారు. ఇది మోడీ గ్యారెంటీ అని కూడా చెప్పుకొచ్చారు.

Written By: NARESH, Updated On : November 8, 2023 1:24 pm

PM Modi : హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దద్దరిల్లిపోయింది. అద్భుత సభ.. క్యాడర్ లో విపరీతమైన జోష్ నింపింది. ఇది ఒక పర్టిక్యూలర్ సెగ్మెంట్. ఇది కేవలం బీసీలకు సంబంధించిన సమావేశం.. స్డేడియం నిండడమే కాకుండా.. బయట కూడా వేచి ఉన్నారు. మోడీ మాట్లాడుతుండగా నినాదాలతో స్టేడియం హోరెత్తింది.

బీఆర్ఎస్ కాంగ్రెస్ , మజ్లిస్ ఏ విధంగా మూడు కలిపి ఒకే తానులో ముక్కలు అన్నట్టు మోడీ వివరించిన తీరు ఆకట్టుకుంది. మోడీ చెప్పిన పాయింట్లలో ప్రధానంగా ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలని.. అందుకే అవినీతిని ప్రోత్సహిస్తాయని.. మూడోది రెండింటికి ఉన్న కామన్ ఫ్యాక్టర్.. మైనార్టీల బుజ్జగింపు ధోరణి’ అని విమర్శించారు. ఈ మూడింటి మోడల్ ఒకటేనని.. కాంగ్రెస్ మోడల్ నే బీఆర్ఎస్ తీసుకొని తెలంగాణలో మిగతా బీసీలను ఏమాత్రం అభివృద్ధి కాకుండా అడ్డుపడిందని మోడీ సునిశిత విమర్శలు చేశారు.

అన్నింటికంటే ముఖ్యమైనది.. తెలంగాణలో చర్చనీయాంశమైనది మోడీ ప్రస్తావించారు. తెలంగాణలో చోటు చేసుకున్న అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతాయని.. తప్పు చేసిన వారిని వదలమని మోడీ హెచ్చరించారు. ఇది మోడీ గ్యారెంటీ అని కూడా చెప్పుకొచ్చారు.

మోడీ సభ విశేషాలు.. ప్రసంగ పాఠాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.