https://oktelugu.com/

New Captain for T20 : టి20 ఫార్మాట్ కు కొత్త కెప్టెన్.. మరి హార్దిక్ సంగతేంటి..?

దీంతో ఆసియా గేమ్స్ కు ఎంపికైన జట్టుతో ఐర్లాండ్ సిరీస్ ఆడాలన్న ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కన్ఫామ్ అయితే రుతురాజ్ గైక్వాడ్ ఐర్లాండ్ పర్యటనలో భారత్ కెప్టెన్ గా ఆడే అవకాశం ఉంది.

Written By:
  • BS
  • , Updated On : July 23, 2023 / 09:37 AM IST
    Follow us on

    New Captain for T20 : భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లు ఆడనుంది. టెస్టులు, వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తుండగా, టి20 ల కోసం హార్దిక్ పాండ్యా నేతృత్వంలోనే మరో జట్టును బిసిసిఐ వెస్టిండీస్ పర్యటనకు పంపించింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోనే టి20 వరల్డ్ కప్ కు యువ జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది. ఇటువంటి తరుణంలో టి20 జట్టును నడిపించేందుకు మరో సారధి కోసం బీసీసీఐ వెతుకులాడుతుండడం సర్వత్ర ఆసక్తిని కలిగిస్తోంది.
    టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఐదు టి20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ టి20 మ్యాచ్ లు కోసం హార్దిక్ పాండ్యా నేతృత్యంలోని యువ జట్టు వెస్టిండీస్ వెళ్ళింది. వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ కోసం యువ జట్టును హార్దిక్ పాండ్యా నేతృత్వంలో సిద్ధం చేస్తోంది బీసీసీఐ. టి20 సిరీస్ ఎక్కడ జరిగిన హార్దిక్ పాండ్యా సారధిగా వ్యవహరిస్తాడని అంతా భావించారు. అందుకు అనుగుణంగానే మేనేజ్మెంట్ కూడా బాధ్యతలను అప్పగిస్తూ వస్తోంది. కానీ, అనూహ్యంగా టి20 జట్టును నడిపించేందుకు మరో సారధి కోసం బీసీసీఐ చూస్తోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
    ఐర్లాండ్ పర్యటనకు మరో కెప్టెన్..
    వెస్టిండీస్ తో ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ పూర్తయిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 18 నుంచి 21 వరకు ఈ పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తోపాటు టి20 సిరీస్ కూడా ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు సీనియర్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. మున్ముందు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ ఉండడంతో సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా వారు మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. దీంతో ఆసియా గేమ్స్ కు ఎంపికైన జట్టుతో ఐర్లాండ్ సిరీస్ ఆడాలన్న ఉద్దేశంలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కన్ఫామ్ అయితే రుతురాజ్ గైక్వాడ్ ఐర్లాండ్ పర్యటనలో భారత్ కెప్టెన్ గా ఆడే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో ఆసియా గేమ్స్ ఆడేందుకు టీమ్ ఇండియా యువ టీమ్ చైనాకు వెళ్లనుంది. ఈ క్రమంలో వారికి ప్రాక్టీస్ కల్పించాలంటే ఐర్లాండ్ సిరీస్ కు ఆ జట్టునే ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హార్దిక్ పాండ్యాతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.