https://oktelugu.com/

YS Viveka Case – ABN RK : వివేక హత్య కేసులో మళ్లీ రెచ్చిపోయి రొచ్చు చేసిన ఆర్కే

కొన్ని కొన్ని విషయాల్లో జర్నలిజం టెంపర్ మెంట్ ప్రదర్శించే రాధాకృష్ణ.. ఈరోజు తన కొత్త పలుకు వ్యాసంలో నిప్పులు చిమ్మారు.. సరే తన పొలిటికల్ లైన్ తనకు ఉండొచ్చు. కానీ విషయాన్ని మాత్రం కుండబద్దలు కొట్టారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 23, 2023 / 09:52 AM IST
    Follow us on

    YS Viveka Case – ABN RK : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్టకేలకు చార్జి షీట్ దాఖలు చేసింది. ” ఈ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉందని” పేర్కొన్నది. దీంతో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రెచ్చిపోయారు.. ఇప్పుడు ఏం అంటావు జగన్? దీనికి సమాధానం ఇవ్వు జగన్? అంటూ తన పత్రిక ఆంధ్రజ్యోతి లో రాసిన కొత్త పలుకు లో ప్రశ్నించారు. ఇన్నాళ్లు అవినాష్ రెడ్డిని ఈ కేసు నుంచి తప్పించేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద తన శక్తి యుక్తులను మొత్తం ఉపయోగించారని, కానీ సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ మరో విధంగా కనిపించిందని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు.  “చార్జ్ షీట్ లో డొల్ల తనం ఉందని ఆయన మీడియా యధావిధిగా వక్ర భాష్యం చెప్పింది. వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళు మేమే హత్య చేశామని ఒప్పుకున్నారు. ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది?  దీనినే మొదటి నుంచి జగన్ అండ్ వాదిస్తోంది. ఇందులో పస లేకపోయినప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టించడంతో పాటు వివేక హత్య కేసులో ప్రధాన సూత్రధారులను రక్షించేందుకు జగన్ అండ్ కో ఆర్గాన్ని ఎంచుకొని ఉంటుంది. మొత్తానికి చార్జి షీట్ దాఖలు అయ్యేవరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా జగన్ మోహన్ రెడ్డి కాపాడుకోగలిగారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య జరిగినప్పుడు రాజకీయంగా లబ్ది పొందేందుకు..  అధికార టీడీపీకి అంటగట్టి రాజకీయ పొందిన జగన్ ఆ తర్వాత రక్షించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.” అని రాధాకృష్ణ రాసుకొచ్చారు.
    లోతుగా దర్యాప్తు 
    వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుంచి సిబిఐ కంటే లోతుగా దర్యాప్తు చేస్తున్న రాధాకృష్ణ.. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కనుక వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కి విశేష ప్రాధాన్యమిచ్చారు.( ఇందులో చంద్రబాబుకు ఫాయిదా ఉంది కాబట్టి) సిబిఐ కొన్నిసార్లు కేసు విచారణలో కొంచెం నెమ్మదితనాన్ని ప్రదర్శించినప్పుడు.. ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడ్డగోలు ఆరోపణలు చేశారు.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బిజెపి చెప్పినట్టు చేస్తోందని విమర్శించారు. జగన్ తనకున్న పలకుబడితో సిబిఐని ఆటాడుకుంటున్నారని దుయ్య బట్టారు. కానీ ఇదే చంద్రబాబు హయాంలో సీబీఐ కి ఆంధ్రప్రదేశ్లో ఎర్రజెండా ఏవిధంగా పాతిందనే దానిపై రాధాకృష్ణ స్పందించరు? ఎస్.. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.. అవన్నీ కూడా ఒకవైపే వేళ్ళను మొత్తం చూపిస్తున్నాయి. వ్యవస్థలు మొత్తం ఆ కేసు విషయంలో చోద్యం చూస్తున్నప్పుడు.. బాధ్యత గల మీడియాకు అందులో బయటకి తీయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు.. కానీ ఈ కేసులో రాధాకృష్ణ చూపిస్తున్న దూకుడు..మిగతా వాటి మీద ఎందుకు చూపించడు? ప్రత్యేకించి  చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విషయంలో మాత్రం ఒక్క ముక్క కూడా రాయడు. ఇక్కడ జాతి ఐక్యతను ప్రదర్శిస్తాడు. పాత్రికేయమంటే న్యూట్రాలిటీని ప్రదర్శించాలి కదా.. మరి ఇక్కడ రాధాకృష్ణ ఏం విలువలు చెబుతున్నట్టు? ఎటువంటి దమ్మును ప్రదర్శిస్తున్నట్టు?
    కొన్ని విషయాలు నిజమే
    వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో రాధాకృష్ణ రాసిన కొన్ని విషయాలు నిజమే. వైయస్ అవినాష్ రెడ్డి మొన్నటివరకు కూడా పులివెందుల ప్రజలకు తెలియదు. రాజారెడ్డి మరో భార్యకు చిన్నారెడ్డి జన్మించారు. ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి, అతడి సంతానమే అవినాష్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అవినాష్ రెడ్డి పులివెందుల ఎంపి అయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ భార్య భారతి పెత్తనం కుటుంబంలో పెరిగిపోయింది.. తన రాజకీయ ఎదుగుదలకు అడుగడుగునా ప్రతిబంధకంగా ఉన్న వివేకానంద రెడ్డి అడ్డు తొలగించుకునేందుకే అవినాష్ రెడ్డి అతడిని హత్య చేయించినట్టు తెలుస్తోందని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. సిబిఐ చార్జి షీటు ప్రకారం కాకుండా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం వాంగ్మూలం ప్రకారం కాకుండా వివేకాహత్య గురించి ప్రపంచానికి వెల్లడి కాకముందే జగన్ మోహన్ రెడ్డి దంపతులకు తెలుసు అని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు..” తెల్లవారుజామున నాలుగున్నరకే అవినాష్ రెడ్డి నుంచి భారతికి సమాచారం అందింది. ఆ తర్వాత జగన్ కు ఆమె విషయం చెప్పింది. ఈ అంశం నేను కొంత క్రితమే చెప్పాను. కారణం వల్ల నాలుగున్నర గంటలకు బదులు ఐదున్నర గంటలు అని అజేయ కల్లం ఆయన వాంగ్మూలంలో చెప్పారు” అని రాధాకృష్ణ రాసుకొచ్చారు. కొన్ని కొన్ని విషయాల్లో జర్నలిజం టెంపర్ మెంట్ ప్రదర్శించే రాధాకృష్ణ.. ఈరోజు తన కొత్త పలుకు వ్యాసంలో నిప్పులు చిమ్మారు.. సరే తన పొలిటికల్ లైన్ తనకు ఉండొచ్చు. కానీ విషయాన్ని మాత్రం కుండబద్దలు కొట్టారు.