https://oktelugu.com/

ATL vs MIA: మెస్సీ ఉన్నా ప్రేక్షక పాత్రకే.. మియామీ.. అట్లాంటా మధ్య పోరు అతడికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

దట్టమైన అడవిలో రెండు కొదమ సింహాలు పోటీ పడితే ఎలా ఉంటుంది.. బుధవారం రాత్రి మియామీ - అట్లాంటా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా అలానే సాగింది.. రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడటంతో ఫలితం తేలకపోయినప్పటికీ మ్యాచ్ మాత్రం ఉత్కంఠ గా సాగింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 19, 2024 / 03:27 PM IST

    ATL vs MIA foot ball Match

    Follow us on

    ATL vs MIA:  అట్లాంటా వేదికగా మేజర్ లీగ్ సాకర్ ఫుట్ బాల్ టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి అట్లాంటా – మియామీ జట్లు పోటీపడ్డాయి. మియామీ జట్టు తరఫున లియోనెల్ మెస్సి ఆడాడు. అట్లాంటా జట్టు తరఫున అలెక్సి మీరాన్ చుక్ బరిలో ఉన్నాడు. ఇటీవల మెస్సి కోఫా కప్ లో గాయపడ్డాడు. ఆ తర్వాత కోలుకొని మేజర్ లీగ్ సాకర్ పోటీలో ఎంట్రీ ఇచ్చాడు.. గాయం నుంచి కోలుకున్నప్పటికీ మెస్సీ తన పూర్వ స్థాయిలో ఆటను ప్రదర్శించలేకపోయాడు.. బంతిని పూర్తిస్థాయిలో నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ దాన్ని గోల్ లాగా మలచలేకపోయాడు. మియామీ జట్టు తరఫున 29వ నిమిషంలో డేవిడ్ రూయీజ్ గోల్ చేశాడు. దీంతో ఆ జట్టు స్కోరు ను సమం చేసింది. అప్పటినుంచి మ్యాచ్ అనేక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఒకానొక దశలో మియామీ జట్టు 2-1 తేడాతో లీడ్ లో కొనసాగింది. ఈ సమయంలో మెస్సీ అట్లాంటా జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. స్టాపేజ్ టైమ్ లో పెనాల్టీ ఏరియాలో మెస్సీ ముగ్గురు ఆటగాళ్ల చుట్టూ బంతిని డ్రిబుల్ చేసినప్పటికీ..అది గోల్ గా మారలేదు. ఇదే సమయంలో మియామీ జట్టు చేసిన పాస్ ను అట్లాంటా జట్టు అడ్డుకుంది. అది మాత్రమే ఆ జట్టుకు కాస్త ఉపశమనం కలిగించింది.

    ఒకానొక దశలో మియామీ జట్టు 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆ సమయంలో అట్లాంటా జట్టు ఆటగాడు మిరాన్ చుక్ బుల్లెట్ లాగా దూసుకొచ్చాడు. బంతిని వేగంగా పాస్ చేసి నెట్స్ లోకి పంపించాడు. దీంతో రెండు జట్ల స్కోరులు సమం అయ్యాయి.. చివరి నిమిషాల్లో రెండు జట్లకు గోల్స్ చేసే అవకాశాలు లభించినప్పటికీ.. వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాయి. అట్లాంటాలోని మెర్సిడేజ్ బెంజ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు 67,795 మంది ప్రేక్షకులు వచ్చారు. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభమైన రెండు నిమిషాల తర్వాత మియా మీ జట్టులోకి మెస్సీ ఎంట్రీ ఇచ్చాడు. జూలియన్ గ్రెసెల్ స్థానంలో అతడు ఆడాడు. ఇటీవల గాయం తర్వాత మెస్సీ కోలుకున్నప్పటికీ.. మునుపటిలాగా అతడు కదల లేకపోతున్నాడు.

    గోల్స్ నమోదయ్యాయి ఇలా

    మ్యాచ్ ప్రారంభమైన 28 నిమిషంలో మియామీ ఆటగాడు డేవిడ్ రూయీజ్ గోల్ చేశాడు.. ఆ తర్వాత ఆట 50 ఎనిమిదవ నిమిషంలో సబా లోబ్జా నిడ్జ్ గోల్ చేసి అట్లాంటాను 1-1 సమంలోకి తీసుకెళ్లాడు. ఈ దశలో మియామీ ఆటగాడు లియోనార్డో కంపానా ఆట 58 వ నిమిషంలో గోల్ చేయడంతో మియామీ జట్టు 2-1 లీడ్ లోకి వెళ్ళింది. ఈ సమయంలో ఆట 83వ నిమిషంలో అట్లాంటా ఆటగాడు అలెక్సీ మిరాన్ చుక్ గోల్ చేసి స్కోర్లను 2-2 సమం చేశాడు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఇంతటి మ్యాచ్ లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం విశేషం. అయితే ఈ మ్యాచ్ అతనికి ఎప్పటికీ గుర్తుండిపోతుందనడం లో సందేహం లేదు.