Indian Women Cricket Team: ఆస్ట్రేలియాలో జరిగిన టి20 మెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయం పాలయింది.. ఇది జరిగిన మూడు నెలల్లోనే మహిళల జట్టు రివెంజ్ తీర్చుకుంది.. అంతకుమించి అనేలా విజయాన్ని సాధించింది.. పురుషులకు సాధ్యంకానిది మహిళలకు సాధ్యమైంది.భారత మహిళల జట్టు ఇంతవరకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. కానీ ఐసీసీ నిర్వహించిన ఏ ఒక్క మేజర్ టోర్నీ సాధించలేదు.. ఆ అపప్రదను ఆదివారం తొలగించుకుంది.. అదికూడా దక్షిణాఫ్రికాలో… ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి టి20 వరల్డ్ కప్ ను ముద్దాడింది.. అరంగేట్రం కప్ ను గర్వంగా స్వదేశానికి తీసుకొచ్చింది.

గతంలో సీనియర్ మహిళల జట్టు పలుమార్లు వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది.. కానీ కప్ తీసుకురావడంలో విఫలమైంది.. ఇదే దశలో షఫాలివర్మ కెప్టెన్సీలో భారత మహిళలు చిచ్చరపిడుగుల మాదిరి రెచ్చిపోయారు.. ఇంగ్లాండ్ జట్టును 68 పరుగులకే కుప్పకూల్చారు.. ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత మహిళలు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో. మరీ ముఖ్యంగా టిటాస్ అయితే నిప్పులు చెరిగేలా బంతులు వేసింది.. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను పేక మేడలా కూల్చేసింది.. ఇప్పుడు ఈ జట్టు సాధించిన విజయంతో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.. గతంలో పురుషుల టి20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పుడు మొదటి కప్ ను ధోని సారధ్యంలోని టీమిండియా గెలుచుకుంది.. అది కూడా దక్షిణాఫ్రికాలోనే… ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా భారత్ మళ్లీ టి20 వరల్డ్ కప్ గెలవలేదు.. అదే సమయంలో 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. మళ్లీ వరల్డ్ కప్ గెలుచుకోలేదు.

ఇక ఇటీవల ఆసియా కప్, టి20 వరల్డ్ కప్, 2019 వన్డే వరల్డ్ కప్ లో భారత్ ప్రదర్శన కప్ కు ఒక అడుగు దూరంలోనే ముగిసింది. ఆసియా కప్ లో భారత ప్రదర్శన అత్యంత దయనీయం.. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. పురుషుల జట్టు చేయలేనిది అమ్మాయిల జట్టు చేసి చూపింది.. ఏ పురుషుల ఇంగ్లాండ్ జట్టు అయితే మనల్ని ఓడించి టి20 వరల్డ్ కప్ గెలుచుకుందో… ఆ దేశానికి చెందిన మహిళల జట్టును భారత మహిళలు ఓడించి టి20 వరల్డ్ కప్ సాధించారు.. పురుషులను ఓటమికి రివెంజ్ తీర్చుకున్నారు.. 2007లో ధోని సారథ్యంలో భారత్ గెలుచుకున్న టి20 వరల్డ్ కప్ కు, ఇప్పుడు అండర్ 19 t20 వరల్డ్ కప్ కు అనేక దగ్గర పోలికలు ఉన్నాయి.. ఇప్పుడు ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.