Rajinikanth- Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన వీర సింహా రెడ్డి ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెల్సిందే..ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా కాలం తర్వాత బాలయ్య సినిమా కావడం తో ఈ మూవీ పై మొదటి నుండి ట్రేడ్ లో భారీ అంచనాలు ఉండేవి..అందుకే ఓపెనింగ్స్ స్టార్ హీరో రేంజ్ లో వచ్చాయి.. కానీ ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయిలకే పరిమితం అయ్యింది.. కానీ ఈ సినిమాకి స్టార్స్ సపోర్ట్ గట్టిగానే ఉంది..కొద్ది రోజుల క్రితమే ప్రభాస్ ఈ చిత్రాన్ని చూసాడు.

ఇప్పుడు లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాని చూసి ప్రశంసల వర్షం కురిపించాడు..సాధారణంగా తెలుగు సినిమాల పై చాలా తక్కువగా మాట్లాడే సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మూవీ గురించి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది..ఈ విషయం పై డైరెక్టర్ గోపీచంద్ మలినేని రియాక్ట్ అయ్యాడు.

ఆయన మాట్లాడుతూ ‘నా జీవితం లో ఈ క్షణాలు మరువలేనిది..సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు చూస్తూ..ఆయనని ఇంతలా ఆరాధించే నేను, నా సినిమాని ఆయన చూస్తాడని..ఇలా నాకు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపిస్తాడని కలలో కూడా ఊహించలేదు..ఈ సినిమా ఆయనకీ ఎంతగానో నచ్చిందట..ఆయన నాతో మాట్లాడిన ఆ పది నిమిషాల సమయాన్ని జీవితాంతం నా జ్ఞాపకాల్లో పదిలపర్చుకుంటాను’ అంటూ రజినీకాంత్ తనతో చెప్పిన మాటలను మీడియా కి పంచుకున్నాడు.
గతం లో కూడా ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా చూసి ఇలాగే కామెంట్స్ చేసాడు..మళ్ళీ ఆయన తెలుగు సినిమాల పై ఇంత గొప్పగా మాట్లాడడం ఇదే అని చెప్పొచ్చు..వీర సింహా రెడ్డి థియేట్రికల్ రన్ దాదాపుగా ఇక ముగిసినట్టే..బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు రావడం తో నందమూరి అభిమానులు సంతోషంగా ఉన్నారు.