Jasprit Bumrah: ఇండియా ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు రెండు జట్లు కూడా చెరొక విజయాన్ని సాధించి 1-1 తో సమం గా ఉన్నాయి. ఇక ఇరు జట్లు ఈ సిరీస్ ను సొంతం చేసుకోవడానికి పోటాపోటీగా మ్యాచ్ లను ఆడుతున్నట్లు గా తెలుస్తుంది. ఇక మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయాన్ని దక్కించుకోగా, ఇండియన్ టీమ్ తనదైన రీతిలో రివెంజ్ గేమ్ ఆడి మరి రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఒక భారీ విక్టరీని సాధించింది.
అయితే రెండో మ్యాచ్ లో ఇండియా గెలవడంలో కీలక పాత్ర వహించిన ‘జస్ప్రీత్ బుమ్రా ‘ మూడోవ మ్యాచ్ కోసం అందుబాటులో ఉండటం లేదనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే బిసిసిఐ బుమ్రా కి ఒక మ్యాచ్ లో విశ్రాంతినివ్వాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి మూడో మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చి మిగిలిన రెండు మ్యాచ్ లకి తనని టీమ్ లో ఆడించాలని బిసిసిఐ ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ బిసిసిఐ మాత్రం ఇలాంటి ఆలోచన లో ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.
ఇక మిగిలిన మూడు టెస్టు మ్యాచ్ లకు ఆడబోయే టీం ని బిసిసిఐ రేపు అధికారికంగా ప్రకటించనుంది. ఇక అదే సమయంలో బుమ్రా విషయం లో కూడా ఒక క్లారిటీ ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఇక రెండోవ టెస్ట్ మ్యాచ్ లో 9 వికెట్లు తీసి ఇండియన్ టీం కి ఘనమైన విజయాన్ని అందించిన బుమ్రా ఒకవేళ మూడో మ్యాచ్ లో ఆడకపోతే ఇండియం టీమ్ బౌలింగ్ లో ఏ మేరకు ప్రభావాన్ని చూపించగలదు అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే ఇండియన్ టీమ్ ఈ సిరీస్ ను గెలిచి 2025 లో జరిగే డబ్ల్యూటిసి ఫైనల్ కి అర్హత సాధించాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా మన ప్లేయర్లు ఆడుతున్న ఆట తీరుకి వాళ్ళని మొచ్చుకోవల్సిందే అంటూ పలువురు ఇండియన్ టీమ్ అభిమానులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…